రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా నిజమాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు 1లక్ష 69వేళా క్యూస్సేక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 32 గేట్ల ద్వారా 1లక్ష 49 వేళా క్యూస్సేక్కులకు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తి కి కాకతీయ ద్వారా 7500 క్యూస్సేక్కులు… సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు.. అలాగే లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూస్సేక్కులు… వరద కాలువ ద్వారా 9700 క్యూస్సేక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగులుహా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 90.313 టీఎంసిలకు గాను ప్రస్తుతం 89.313 టీఎంసి నీటి నిల్వలున్నాయి. అయితే ఈ వార్ధా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.