దారుణం: వాటికోసం కన్నతల్లిని కూడా కడతేర్చిన కసాయి కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంధాలు.. అనుబంధాలకు విలువ లేని ప్రపంచం.. కన్న తల్లిదండ్రుల కంటే కరెన్సీ నోట్లకే ఎక్కువ విలువ ఇవ్వడం బాధాకరమైన విషయం అయితే.. డబ్బుకోసం కనిపెంచిన వారిని అత్యంత దారుణంగా కడతేర్చడం విచారించాల్సిన విషయం. తాజాగా ఒక కసాయి కొడుకు, తల్లి ఐదెకరాల పొలం నుంచి వచ్చే రైతు బంధు డబ్బుల కోసం కిరాతకంగా చంపిన ఘటన నిజామాబాద్ లో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ముక్కెర సాయమ్మ(50) కు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు. భర్త మృతిచెందడంతో అతని పేరు మీద ఉన్న ఐదెకరాల పొలం సాయమ్మ పేరుకు మారింది. ఆ పొలం మీద వచ్చే డబ్బుతోనే కొడుకును చదివించి, పెద్దవాడిని చేసి, ముగ్గురు కూతుళ్ళకు వివాహం చేసింది. బాధ్యతలు అన్ని తీరాక , కొడుకు నారాయణ దగ్గరే ఉంటుంది. ఇక ఇటీవల ఆమె ఐదెకరాల పొలంపై కొడుకు కన్నేశాడు. ఆ భూమిని తన పేరు మీద రాయాలని తల్లితో ఘర్షణకు దిగాడు.
Also Read
గత కొన్ని నెలల నుంచి ఆ భూమికి రైతు బంధు పథకం కింద ఆమె అకౌంట్ లో రూ. 25 వేలు జమ అవుతన్నాయి. ఈ డబ్బు విషయంలో తల్లితో గొడవపడిన నారాయణ పొలం తన పేరుమీద రాయాలని బలవంతం చేశాడు. ఆమె ససేమిరా అనడంతో కోపంతో రగిలిపోయిన అతడు తల్లి అని కూడా చూడకుండా గోడకేసి బాది, ఆమె స్పృహ తప్పి పడిపోగా ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా నిద్రలో తల్లి చనిపోయినట్లు నమ్మించాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా సాయమ్మది హత్య అని గుర్తించారు. అనంతరం కొడుకును తమదైనరీతిలో ప్రశ్నించగా నిజం బయటపెట్టాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు రుద్రూర్ సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
BYD Denza D9: భారత్‌లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్‌బ్యాగ్స్.. ధర ఎంతంటే?
-
Usman Khawaja: ఉస్మాన్ ఖవాజా బెడ్‌పై మైఖేల్ బీర్ ఆ పని చేశాడా?.. వెలుగులోకి సంచలనం విషయం!
-
Non Binary Gender: పురుషుడు, స్త్రీకి భిన్నమైన లింగ గుర్తింపు.. నేహా బోరా గుర్తించుకున్న నాన్ బైనరీ జెండర్ అంటే?
-
Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
-
Microsoft Global Outage: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్‌కు కారణం ఇదే.. సైబర్ అటాక్ కాదు.. AIతో సంబంధం లేదన్న సంస్థ
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!