MLC Kavitha: కేటీఆర్ చేతుల మీదుగా ఈనెల 29న ఐటి హబ్ ప్రారంభం అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన ఐటీ హబ్‌లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ఈ జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ గణేష్ గుప్తాతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. విదేశీ కంపెనీలు వచ్చేందుకు సహకరించిన బిగాస్‌కు మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఐటీ హబ్ అనేది కేవలం ఉద్యోగమే కాదు, ఉద్యోగాల కల్పనకు కూడా దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ హబ్ స్థలాన్ని యువత తమ నైపుణ్యంతో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిజామాబాద్‌లో సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి ఐటీ హబ్ కేంద్ర బిందువుగా నిలుస్తుందన్నారు. ఇది మొదటి దశ మాత్రమేనని, త్వరలో రెండో దశగా ఐటీ హబ్‌ను ప్రారంభిస్తామన్నారు. పారిశ్రామిక పార్కు, ఆటో పార్కు అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నిజామాబాద్ నంబర్ వన్ ఐటీ హబ్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు ఐటి ఉద్యోగాలు అంటే కేవలం బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైందని అయ్యారు. గ్రామీణ స్థాయిలో ఐటి విద్య అభ్యసించినవారి కోసం ఐటిఉద్యోగాలు అందించే లక్షంతో ఈ ఐటి హబ్ ఏర్పాటు జరిగిందని తెలిపారు. యువత తమ స్కిల్స్ తో ఐటి హబ్ స్పేస్ ను వాడుకోవాలని అన్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ లో జాబ్ రాకుంటే నిరుత్సాహ పడొద్దని సూచించారు. 745 సీట్లు ఉన్నాయి.. రెండవ సారి ప్రయత్నం చేయాలని, 745 సీట్ల తో పాటు టాస్క్ అధ్వర్యంలో లో 1000 మంది కి ఐటి లో ఇతర రంగాల్లో శిక్షణ అందిస్తామన్నారు. నిజామాబాద్ లో సాఫ్టు వేర్ అభివృద్ధి కి ఐటి హబ్ కేంద్ర బిందువు అవుతుందని అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ,ఆటో పార్క్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. 10 వేల రిజిస్టేషన్ లు రావటం చాలా గొప్ప విషయమన్నారు. యువత రాజకీయల సంగతి కంటే ముందు ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని అన్నారు.
బి.ఆర్.ఎస్. లో అన్ని సింహాలే, కొన్ని పార్టీల్లో గ్రామ సింహాలు ఉన్నాయని తెలిపారు. ఎంపీ అర్వింద్ బాల్కొండలో అతిగా అసభ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రజలే ఆయనకు బుద్ధి చెప్పాలని అన్నారు. తెలంగాణలో సంపద సృష్టించం అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు. బీజేపీ కాంగ్రెస్ పాలనలో అవినీతి జరగలేదా..? అని ప్రశ్నించారు. అండర్ గ్రౌండ్ డ్రైనెజీ డబ్బులు ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలుసని చురకలంటించారు. ఎంపీ అర్వింద్ పిచ్చి ప్రేలాపణలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల సమయం ఇస్తా ఆరోపణలు నిరూపించు, లేకపోతే ముక్కు నేలకు రాయాని సవాల్ విసిరారు. పేదల పక్షాన ఉండే పార్టీ బి ఆర్.ఎస్. పార్టీ అన్నారు. కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ , డి.ఎన్.ఏ. బి.ఆర్.ఎస్. తో మ్యాచ్ కాదని అన్నారు. బంపర్ మెజార్టీ తో మళ్ళీ గెలుస్తాం, సర్వేల్లో కాంగ్రెస్ మా దారి దాపుల్లో లేదని అన్నారు. ధరణి మా పాలసీ, దళారులు మా పాలసీ అని అన్నారు.
America: రష్యాపై అమెరికా క్లస్టర్ ఆయుధాలు.. ఉపయోగిస్తున్న ఉక్రెయిన్