Women Thieves: షిర్డీ రైలులో మహిళా దొంగలు బీభత్సం సృష్టించారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలోని క్రాసింగ్ వద్ద రైలు ఆగింది. అక్కడే ట్రైన్ దోచుకునేందుకు వేచి వున్న మహిళలు రైలు ఆగడంతో ఒక్కసారిగా 9 మంది అందులో ఎక్కారు. అది గమనించిన ప్రయాణికులు ఎందుకు అంతమంది మహిళలు ఎక్కుతున్నారు అనుకున్నారే తప్పా.. వాళ్ళు దొంగతనం చేసేందుకు వచ్చారని అస్సలు ఊహించుకోలేక పోయారు. ఎస్ 1 నుంచి ఎస్ 10 భోగి వరకు మహిళలు తిరుగడం మొదలు పెట్టారు. అయితే సీటు కోసం వెతుకున్నారని అనుకున్నారే తప్పా ప్రయాణికులపై దాడి చేస్తారని అనుకోలేదు. భోగీలో ఎలాంటి ప్రమాదం లేదని ముందుగానే గమనించి ఇక అక్కడ ప్రయాణికుల వద్ద వున్న బ్యాగులను దోచుకునేందుకు సిద్దమయ్యారు. బ్యాగులు, మహిళ మెడలోని గొలుసులు లాక్కున్నారు. కొందరు మహిళలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో ఎస్ 1 నుంచి ఎస్ 10 భోగిలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అయితే వారిని బెదిరించారు మహిళా దొంగలు.
Read also: Rajini Vs Chiru: స్టార్ హీరోల వార్ లో గెలిచేదెవరు?
బాసర సమీపం వరకు ప్రయాణించి ఆతరువాత చైన్ లాగి దిగేందుకు ప్లాన్ వేసుకున్నారు దొంగలు. ఇది గమనించిన కొందరు ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 9మంది రైల్ లో ఎక్కి దొంగతనానికి పాల్పడ్డారని వారందరు బాసర వరకు వస్తున్నారని తెలుపడంతో వారికికోసం రైల్వే పోలీసులు కాపుకాసారు. బాసర సమీపం రాగానే మూకుమ్ముడిగా రైల్వే పోలీసులు ట్రైన్ లో ఎక్కారు. ఏమీ తెలియనట్లు మహిళలు కూర్చుండటంతో రైల్వే అధికారులు వారిని గమనించి చాకచక్యంగా అదుపులో తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందగానే రైల్వే పోలీసులు స్పందించడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. దొంగతనానికి పాల్పడ్డ 9మంది మహిళలు మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Nayakudu: చాలా రోజుల తర్వాత ‘నాయకుడు’ కోసం రెహమాన్ ఫోక్ సాంగ్…