Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ, విజిలెన్స్ సోదాలు.. నేడు వీసీ ని విచారించే చాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana University: తెలంగాణ యూనివర్సిటీ లో ఏసీబీ, విజిలెన్స్ బృందాల దాడుల టెన్షన్ మొదలైంది. నిన్న 8 గంటల పాటు యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టిన అధికారుల బృందం కీలక దస్త్రాలు, హార్డ్ డిస్క్ ల స్వాధీనం చేసుకున్నారు. నేడు వీసీ ని విచారించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇవాళ కూడా ఏసీబీ, విజిలెన్స్ బృందం తనిఖీలు చేపట్టనున్నారు. యూనివర్సిటీ రెండేళ్ల బ్యాంక్ లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. యూనివర్సిటీలో రెండేళ్లలో చేసిన ఖర్చులు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలు, పదోన్నతులు, నిధుల దుర్వినియోగం విచారణ చేయాలని ఈసీ పిర్యాదు చేయడంతో ఏసీబీ, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఇంచార్జీ రిజిస్ట్రార్ కనకయ్యను విజిలెన్స్ అధికారులు విచారించారు. ఇవాల తనిఖీలపై ఉత్కంఠ నెలకొంది.
Read also: Saptapadhi: ఎడారిలో సప్తపది..
Also Read
అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగంతో వివాదంగా మారిన తెలంగాణ యూనివర్సిటీ హైదరాబాద్ కు చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో దాదాపు 15 మందికి పైగా విజిలెన్స్ అధికారులు మూడు వాహనాల్లో పరిపాలన భవనం వద్దకు వచ్చి పరిపాలన భవనంలోని వీసీ ఛాంబర్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, అకౌంట్ సెక్షన్, ఇంజినీరింగ్ విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు. అంతకుముందు ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమైన కంప్యూటర్ సీపీయూ, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అకౌంట్ సెక్షన్ లో పెట్టి అందులోని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పాలక మండలి, ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు సోమవారం రాత్రి జిల్లాకు చేరుకున్న విజిలెన్స్ అధికారుల బృందం మంగళవారం మధ్యాహ్నం పరిపాలనా భవనానికి చేరుకుంది. వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా అప్పటికే కారులో పరిపాలన భవనం నుంచి ముఖ్యమైన ఫైళ్లను తీసుకుని వెళ్లిపోయారు. అధికారుల బృందం తొలుత వీసీ ఛాంబర్‌కు వెళ్లి చూడగా వీసీ అక్కడ లేకపోవడంతో వీసీ పీఏ సవిత కూడా ఛాంబర్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. పరిపాలన భవనంలోని ఎస్‌బీఐ బ్యాంకు అధికారులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు యూనివర్సిటీకి సంబంధించిన అన్ని ఖాతాలకు సంబంధించిన లావాదేవీల వివరాలను సేకరించారు. అవన్నీ ప్రింటవుట్ ద్వారా బ్యాంకు నుంచి తీసుకున్నవే. అకౌంట్ సెక్షన్ లో ఐదు కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లను సీజ్ చేసి సీల్ చేశారు.
Top Headlines @9AM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..