తెలంగాణకి చెందిన అమరవీరులకు న్యాయం చేయకుండా బీహార్ వెళ్లి బాధితులకు చెక్కులు పంపిణీ చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లురవి కేసీఆర్ తీరుపై విమర్శలు చేశాఉఉ. కొండారెడ్డి పల్లి లో యాదయ్య అనే వ్యక్తి జవాన్ గా పని చేశారు. 2013 లో జమ్ము లో టెర్రరిస్ట్ ల దాడిలో చనిపోయారు. ఆయనను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అది అమలు కాలేదన్నారు. ఐదు ఎకరాల భూమి ఇస్తా అన్నారు.. పిల్లల చదువుల కోసం డబ్బులు ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు సెంట్ భూమి ఇవ్వలేదు
యాదయ్య భార్య సుమతికి ఉద్యోగం ఇస్తున్నట్టు ఆర్డర్ ఇచ్చారు. కానీ జాయినింగ్ కోసం వెళ్తే..ఆ పోస్ట్ లో ఇంకొకరు ఉన్నారు అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు భూమి లేదు…ఇల్లు లేదు. ఈ జవాన్ కుటుంబాన్ని ఆదుకోండి అని జిల్లా కలెక్టర్ కి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కానీ స్పందన లేదన్నారు మల్లు రవి. పుల్వమా దాడిలో చనిపోయిన వారిని ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లారు. కానీ తెలంగాణ లో కొండారెడ్డి పల్లి కి చెందిన జావాన్ కుటుంబం కి మాత్రం చేతులు రాలేదు. పాట్నా వరకు వెళ్ళారు.
Read Also: Suman: చావుబతుకుల మధ్య సుమన్.. క్లారిటీ ఇచ్చిన నటుడు
కానీ తెలంగాణ లో అమర జవాన్ కి ఎందుకు సాయం చేయరని మల్లు రవి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల డబ్బులు బీహార్ వాళ్లకు ఇచ్చారు కానీ..ఇక్కడి అమర జవాన్ లను ఎందుకు ఆదుకోవడం లేదు. తెలంగాణలో అన్యాయం కి గురైన వారిని అదుకోకుండా బీహార్ వరకు వెళ్ళారు. మీ ఉద్దేశం మంచిదే అయితే…ముందు తెలంగాణ లో అమర జవాన్ ల కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు మల్లు రవి. ప్రభుత్వం స్పందించక పోతే నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయము ముందు సత్యాగ్రహ దీక్షచేస్తానన్నారు మల్లు రవి. అమర జవాన్ యాదయ్య భార్య.. పిల్లలు గాంధీ భవన్ కి వచ్చి కాంగ్రెస్ నేతలకు తమ ఇబ్బందుల్ని వివరించారు.