తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి విజయవాడలో పర్యటించనున్నారు.. మూడేళ్ల తర్వాత మళ్లీ విజయవాడలో అడుగుపెట్టబోతున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… గతం పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో సమావేశం అయ్యారు కేసీఆర్.. 2019 జూన్‌లో కేసీఆర్-వైఎస్ జగన్ మధ్య సమావేశం జరిగింది.. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్‌కు సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు.. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు ఏపీ సీఎం.. హైదరాబాద్‌లోనూ రెండు రాష్ట్రాల అంశాలపైన ఇద్దరు సీఎంలు, అధికారులతో సమీక్షలు కూడా చేశారు.. అయితే, ఆ తర్వాత కొన్ని విషయాలు రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది.. జల వివాదాల్లో మాటల యుద్ధమే నడిచింది.. అయితే, మరోసారి విజయవాడ వెళ్తున్నారు కేసీఆర్.. అయితే, ఇప్పుడు ఆయన వెళ్లేదే.. సీపీఐ జాతీయ మహాసభల కోసం.
Read Also: Tankbund Shiva: త్వరలో మీ ఇంటికొస్తా.. ఆసక్తి రేపుతున్న కేటీఆర్ ట్విట్
విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకు సీపీఐ జాతీయ మహాసభలు జరగబోతున్నాయి.. ఈ మహాసభల్లో పాల్గొనాలని సీపీఐ నుంచి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు.. ఈ విషయాన్ని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు.. ఇక, సీపీఐ జాతీయస్థాయి సమావేశాల్లో కేరళ సీఎం పినరయి విజయన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా పాల్గొనబోతున్నారు.. కేరళ, బీహార్ సీఎంలతో పాటు 20దేశాలకు చెందిన కమ్యూనిస్ట్ నేతలకు ఆహ్వానాలు అందాయి.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ఆర్ఎస్పీ, ఫార్వార్డ్ బ్లాక్ లాంటి లెఫ్ట్ నేతలు కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. సీపీఐ జాతీయ నేతల ఆహ్వానం మేరకు బెజవాడ వెళ్లనున్నారు కేసీఆర్.. అయితే.. 14 నుంచి 18 తేదీల్లో ఆయన ఎప్పుడు వెళ్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే, కేరళ, బీహార్ సీఎంలు కూడా హాజరుకానున్న నేపథ్యంలో.. వారి షెడ్యూల్ ప్రకారమే కేసీఆర్ కూడా బెజవాడ వెళ్తారని.. మరోసారి నితీష్ కుమార్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉందని.. పనిలో పనిగా కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తోనూ ఆయన చర్చలు జరిపే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మొత్తంగా.. మూడేళ్ల తర్వాత తెలంగాణ సీఎం.. ఏపీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.