నేడు రైతులకు పెట్టుబడి పైసలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. తొలిరోజు ఎకరం భూమి ఉన్న రైతులకు ఎప్పటిలాగే పైసలు పడనున్నాయి. క్రమపద్దతిలో రైతులందరికీ జమ చేయనున్నారు. అయితే.. ఈ ఏడాది కొత్తగా 3064లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందనుంది. అయితే గత సీజన్ తో పోల్చితే లబ్దిదారులైన రైతుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు నిధుల మొత్తం కూడా పెరిగింది. ఇప్పుడు ఈ వానకాలం సీజన్‌కు రైతుబంధుకు…
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో నేడు (శనివారం) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్నికైన తరువాత మంత్రి కేటీఆర్ తొలిసారిగా కొల్లాపూర్ పట్టణానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు కొల్లాపూర్ బస్ డిపో సమీపంలోని అయ్య ప్ప ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ముందుగా పట్టణంలో రూ.170 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి…
పల్లె నిద్రలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని రంగాపూర్ గ్రామంలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలు పరిశీలించిన ఆయన.. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నామని.. ప్రతి ఊరికి మౌలిక సదుపాయాల్ని కల్పిస్తున్నామని చెప్పారు. దశలవారీగా అన్ని పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడం,…
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ చేతుల మీదుగా డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, కృష్ణయ్య, బీద మస్తాన్ రావు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని తిరిగి రెండోసారి ఎంపికచేశారు సీఎం జగన్. అలాగే బీసీ వర్గానికి చెందిన ఆర్.కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావు, సుప్రీంకోర్టులో న్యాయవాది ఎస్,నిరంజన్‌రెడ్డిలకు జగన్…
హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల మీద మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మరోసారి తెలంగాణపై విషం చిమ్మారని, ఆయన చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. తల్లిని చంపి పిల్లని బతికించారన్న మోదీకి.. తెలంగాణ అమరవీరుల గురించి అర్హత లేదని, అసలు తెలంగాణలో బీజేపీకి స్థానమే లేదని అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దేశాన్ని…