వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఢిల్లీకి వెళ్లిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..ఇది చాలా గంభీరమైన విషయమన్నారు. మరోసారి సమీక్ష చేసి రైతాంగాన్ని సంప్రదించిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదన్నారు. అందమైన భాషలో ఉపన్యాసాలు ఇచ్చి, ఇదే దేశ భక్తి అంటే ఎలా…? అని…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల అంశం ఇప్పుడిప్పుడే తేలేలా లేదు. ఓ వైపు యాసంగి సీజన్ ప్రారంభం అవుతుండటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం వరి పంటను వేస్తే కొనమని ఇప్పటికే స్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.వానాకాలం ధాన్యం కొనుగోలు పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాగా మరోసారి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తో అమితుతమీ తేల్చుకోవడానికి రాష్ర్టప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే మంత్రుల బృందం మరోసారి ఢిల్లీకి వెళ్లింది.…
యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది… ఈ మేరకు తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం.. సమైక్య రాష్ట్రంలో 22 లక్షల బోర్ల ద్వారా వ్యవసాయం జరిగింది.. కానీ, కేసీఆర్ మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. సాగుభూమి ఏడేండ్లలో 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.15 కోట్ల ఎకరాలకు చేర్చారని తెలిపారు..…
రాష్ట్రప్రభుత్వం అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించకపోవడం దురదృష్టకరం అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అధికారుల వ్యవహారశైలి కూడా కేసీఆర్ కు అనుగుణంగా ఉంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అధికారులపై తక్షణమే చర్యలు తీసకోవాలి. గత మూడు నెలలుగా తెలంగాణ రైతాంగం వరిధాన్యం అమ్ముకోలేక అవస్థలుపడుతున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ శ్రేణులు రైతాంగం సమస్యలపై పోరాటం చేస్తున్నా రాష్ట్రప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో మొక్కుబడి ఆందోళన చేస్తున్నారు. ఎంపీలు సేదదీరే…
తెలంగాణలో వరి ధాన్యం పై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తునే ఉంది. కేంద్రం, రాష్ర్టం ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటునే ఉన్నాయి. మొన్న ఈ మధ్య ఇదే విషయన్ని చర్చించడానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తన బృందంలో ఢీల్లీ వెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే రైతులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అటు బీజేపీ నాయకుల మాటలు వినాలా..ఇటు ప్రభుత్వ మాటలు వినాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. తాజాగా మరోసారి…
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరకని పరిస్థితి వచ్చింది.. అయితే, ఏ పంట పడితే అది వేసి.. నష్టాలు చవిచూడొద్దని చెబుతున్నారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. ఈ యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.. యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయాలని కోరిన ఆయన.. పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలని.. మినుముల…
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండి పడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకోసం పాదయాత్ర చేపడుతున్నాడు, ముందు తమ పార్టీ తెలంగాణ కు ఏమి ఇచ్చిందో చెప్పి పాద యాత్ర చేయాలని అన్నారు. సస్యశ్యామలం అయిన తెలంగాణలో అలజడులు సృష్టించేందుకు కొన్ని శక్తులు యాత్రల పేరుతో బయలుదేరాయని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలను దోచుకొని తింటున్న బీజేపీ పార్టీ…