Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు రైతులకు పెట్టుబడి పైసలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. తొలిరోజు ఎకరం భూమి ఉన్న రైతులకు ఎప్పటిలాగే పైసలు పడనున్నాయి. క్రమపద్దతిలో రైతులందరికీ జమ చేయనున్నారు. అయితే.. ఈ ఏడాది కొత్తగా 3064లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందనుంది. అయితే గత సీజన్ తో పోల్చితే లబ్దిదారులైన రైతుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు నిధుల మొత్తం కూడా పెరిగింది. ఇప్పుడు ఈ వానకాలం సీజన్‌కు రైతుబంధుకు అర్హులైన రైతుల సంఖ్య 68.94 లక్షలుగా లెక్కతేల్చింది ప్రభుత్వం. అయితే రైతుబంధు పంపిణీ కోసం రూ.7,654.43 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ తెలపడంతో.. 1.53 కోట్ల ఎకరాలకు ప్రభుత్వం రైతుబంధు జమ చేయనుంది. ఇవాళ తొలిరోజైన మంగళవారం ఎకరం భూమి ఉన్న 19.98 లక్షల మంది రైతులకు రూ.586.65 కోట్లు ఖాతాల్లో జమచేసేందుకు సర్వం సిద్దం చేసింది.
అయితే వానాకాలం ప్రారంభం కాగానే రైతుబంధు సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు రైతన్నలు. కాగా రైతులను ఆశను వమ్ము చేయకుండా ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట ప్రకారం సీజన్ ప్రారంభ సమయంలోనే రైతుబంధు నిధులను అందించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నేడు (మంగళవారం) నుంచి రైతుబంధు పైసలు జమవుతుండడంతో రైతుల్లో సంతోషం, కళ్లల్లో ఆనందం కనిపించనుంది. పెట్టుబడి భారం తీరిందనే భరోసా వారిలో కనిపించనుంది. అయితే గత ఏడాది సీజన్ వరకు రికార్డు స్థాయిలో రైతుబంధు కింద రూ. 50,448 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. కాగా.. ఈ సీజన్‌లో పంపిణీ చేయబోయే రూ. 7,654.43 కోట్లతో కలిపితే ఇప్పటివరకు రూ. 58,102 కోట్లకు అందించిన సాయం చేరనుంది.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి రైతుబంధు పంపిణీకి వ్యవసాయశాఖ తరుపున ఏర్పాట్లు పూర్తిచేశామని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు. ఉదయం పూటే రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలు జమయ్యేలా చర్యలు తీసుకొన్నాం. రైతులకు ఏమైనా సమస్యలుంటే స్థానిక ఏఈవోను కలిసి ఫిర్యాదు చేస్తే సమస్యలను పరిష్కరిస్తామని రఘునందన్‌రావు ప్రకటించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!