ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక పూర్తయింది. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైసీపీ ముందునుంచీ బలహీనవర్గాలకు పెద్ద పీట వేస్తుందని జగన్ నిరూపిస్తున్నారు. బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. నాలుగింట సగం స్థానాలు బలహీన వర్గాలకే ఇచ్చారు.…
వ్యవసాయం ఆగిపోతే ప్రపంచం అంతరిస్తుందని…వ్యవసాయం బాగుండాలి… అన్నదాతను గౌరవించాలని… ప్రపంచ వ్యవసాయానికి నీటి ప్రాముఖ్యత తెలిపిన నేల ఓరుగల్లు అని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల వానాకాలం పంటల అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. 11 వ శతాబ్దంలోనే గొలుసుకట్టు చెరువులు, కుంటలు, ప్రముఖ ఆలయాలను కాకతీయ రాజులు నిర్మించారని…
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆచార్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన విషయం అందరికీ తెలుసు! చిరంజీవి, రామ్ చరణ్ లాంటి క్రేజీ స్టార్స్ ఉన్నా.. కథ – కథనాలు సరిగ్గా లేకపోవడంతో నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. దీంతో, రెండో రోజు నుంచే ఆడియన్స్ ఈ సినిమాని తిరస్కరించారు. తద్వారా ఇది భారీ నష్టాల్ని మిగిల్చింది. చిరు, చరణ్‌ల క్రేజ్.. కొరటాల ట్రాక్ రికార్డ్ చూసి.. ఫ్యాన్సీ రేట్లకు ఈ సినిమా…
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సుని నిర్వహించారు. ఇందులో భాగంగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఇతర లాభసాటి పంటల్ని సాగు చేయాలని, యాజమాన్య పద్ధతులు పాటిస్తూ వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకురావాలని అన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు దృష్టి పెట్టి, పంటల సాగులో ఆదర్శంగా నిలవాలన్నారు. రైతుల గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి,…
Mishan Impossible చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాప్సి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహించారు. ఈ హై-ఆన్ ఎంటర్టైన్మెంట్ మూవీలో హర్ష్ రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి అతిధి పాత్రలో నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. బుధవారం సాయంత్రం 6…
చాలా సంవత్సరాల తర్వాత మిల్కీ బ్యూటీ తాప్సీ పన్ను “మిషన్ ఇంపాజిబుల్” అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కనిపించనుంది. సరదాగా సాగే ఈ థ్రిల్లర్‌ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. హర్ష రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. స్వరూప్ ఆర్‌ఎస్‌జే…
తెలంగాణకు నాబార్డు గుడ్‌న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి లక్షా 66 వేల 384 కోట్ల రుణ సామర్థ్యంతో నాబార్డు రూపొందించిన రాష్ట్ర దృష్టి పత్రాన్ని మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలని.. జనాభాలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని చెప్పారు. Read Also: కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలి: వీహెచ్ నాబార్డ్ సహకారంతో మిషన్ కాకతీయ పథకం కింద…
ఇతర రాష్ట్రాల పల్లెల కన్నా తెలంగాణ పల్లెలు నేడు బాగున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వననపర్తి జిల్లాలోని గోపాల్‌పేట మండలం కేశంపేట, చెన్నారం గ్రామాల పరిధిలో ఉన్న ఎంజే 1 కాలువను పరిశీలించి కృష్ణా జలాలకు పూలు చల్లి పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. అన్నదాతలు సుభిక్షంగా ఉంటేనే సమాజం బాగుంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. రైతులు సంతోషంగా ఉండేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతుబంధు ద్వారా…
తెలంగాణలో నాలుగో రోజు 6 లక్షల 75 వేల 824 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1144.64 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. దీంతో కలిపి ఇప్పటి వరకు 52 లక్షల 71 వేల 91 మంది రైతులకు రైతుబంధు నిధులు అందింది. మొత్తం పెట్టుబడి సాయం రూ. 4246.68 కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. సంప్రదాయ సాగు నుంచి రైతులు బయటకు రావాలని సూచించారు.…
తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతోందని.. ఈ ప్రక్రియ ముగియగానే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాలను టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిందన్నారు. మిగతా ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందని తెలిపారు. కేంద్రం పరిధిలో 8…