ప్రముఖ గాయకుడు సాయి చంద్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందిస్తున్నారు. సాయి చంద్ మరణవార్త విన్న మంత్రి హరీష్ రావు, బాల్కా సుమన్ కేర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వనపర్తి జిల్లా నూతన ఎస్పీ కార్యాలయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్ముద్ ఆలీ ప్రారంభించారు. మహమ్ముద్ ఆలీ వెంట మంత్రి నిరంజన్ రెడ్డి.. డీజీపీ అంజన్ కుమార్ ఉన్నారు.
Niranjan Reddy: ఎలాంటి దాన్యం అయిన, ప్రతీ ధాన్యపు గింజ కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని జిల్లా కలెక్టర్లకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు.
Niranjan Reddy criticizes BJP and Kishan Reddy: ఉపాధి హామీ పనుల కింద కల్లాల నిర్మానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని.. కానీ ఈ పనులు చేయడానికి వీలు లేదని కేంద్రం తెలంగాణకు నోటీసులు ఇచ్చింది.. రైతుల కోసం కల్లాలు కట్టడం నేరామా..? అని ప్రశ్నించారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఉపాధి హమీ పనుల్లో వ్యవసాయ ఉత్పత్తి పెంచే పనులు చేసుకోవచ్చని చట్టం చెబుతోందని ఆయన అన్నారు. అయినా కేంద్రం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.