వైసీపీలో రెడ్లకు పెత్తనం ఇస్తూ బీసీలను అణగదొక్కుతోంది జగన్ కాదా..? అని ప్రశ్నించారు టీడీపీ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. బీసీల బ్యాక్ బోన్ విరగొట్టిందే జగన్. జగన్ తాను పక్కకు తప్పుకుని బీసీలకు సీఎం సీటు ఇవ్వగలరా..? టీడీపీలో బీసీలుగా ఉన్న నేనో, అచ్చెన్నాయుడో, అయ్యన్నో మాట్లాడతాం.
వైసీపీలో ఎవరు మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు పంచి పెత్తనం చేయమంటున్నారు. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి వంటి వారికే పెత్తనం కట్టబెట్టడం నిజం కాదా..? బీసీ సెన్సెస్, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు వంటి అంశాల్లో కేంద్రాన్ని సీఎం జగన్ ఏనాడైనా ప్రశ్నించారా..? స్థానిక సంస్థల్లో టీడీపీ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే.. దాన్ని పది శాతానికి కుదించింది వైసీపీ కాదా..? అని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ అంటేనే బీసీల పార్టీ.. మేం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీని నడుపుతోందే బీసీలు. మస్తాన్ రావు, కృష్ణయ్యలు మా పార్టీ నుంచే వెళ్లారు. వైసీపీలో బీసీలెవరూ లేరు కాబట్టే.. మా పార్టీ నుంచి వెళ్లిన బీసీ నేతలకు రాజ్యసభ ఇచ్చారు. బీసీలకు పదవులివ్వడం మంచిదే.. కానీ పెత్తనం లేని పదవులే వైసీపీ బీసీలకు దక్కుతున్నాయన్నారు. లాబీయింగ్ కోసం నిరంజన్ రెడ్డి వంటి వాళ్లకు పదవులిచ్చినా.. ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు యనమల.
ఏపీ నుంచి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాల్లో రెండు స్థానాలను బలహీనవర్గాలకు కేటాయించారు జగన్. బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలకు తాము పెద్ద పీట వేశామని, జగన్ ఆలోచనా విధానాలకు ఇది అద్దం పడుతోందని మంత్రి బొత్స పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై యనమల ఇలా ఘాటుగా స్పందించారు.
LIVE: ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వీరే