నైజీరియా దేశంలో దారుణం జరిగింది. ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుడు ఘటనలో 50 మంది మరణించారు.ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చిలో పెంతెకోస్ట్ ఆరాధకులు గుమిగూడిన సమయంలో వారిని లక్ష్యంగా చేసుకొని ముష్కరులు దాడి చేశారని శాసనసభ్యుడు ఒగున్మోలసుయి ఒలువోలే తెలిపారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఓండో రాష్ట్రంలోని ఓవోలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చ్‌లో ప్రజలు ప్రార్థనలు చేసుకుంటున్నారు.…
ప్రపంచాన్ని ప్రస్తుతం మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేవలం సెంట్రల్ ఆఫ్రికా దేశాలకే పరిమితం అయిన మంకీపాక్స్ ప్రస్తుతం యూరప్, అమెరికా దేశాలకు పాకింది. బ్రిటన్ లో మొదటిసారిగా ఈ ఏడాది మే మొదటి వారంలో తొలికేసు నమోదు అయింది. నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ వ్యాధిని కనుక్కున్నారు. ఆ తరువాత నుంచి పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో మే 18న తొలి కేసు నమోదు…
ఉగ్రవాద సంస్థ బోకోహారామ్ రెచ్చిపోయింది. అత్యంత పాశవికంగా మారణహోమానికి పాల్పడింది. నైజీరియా దేశంలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగింది. తమ సమాచారాన్ని నైజీరియా మిలటరీకి ఇస్తున్నారని ఈ దాడికి పాల్పడింది. దేశంలోని ఉత్తర ప్రాంతం కామెరూన్ దేశ సరిహద్దుల్లోని బోర్నో ప్రావిన్స్ లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ దాడిలో 50 మంది దాకా మరణించినట్లు సమాచారం. దాడిలో గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు… కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పంటపొలాల్లో…
ఆఫ్రికాలోని అనేక దేశాలు పేదరికంలో మగ్గుతున్నాయి. రోజువారి ఖర్చుల కోసం అక్కడి ప్రజలు ఏలాంటి పని చేయడానికైనా సిద్ధమవుతుంటారు. దీనిని కొందలరు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. వారీ జీవితాలతో ఆడుతుకుంటున్నారు. నైజీరియాలో పిల్లల కోసం ఓ ఫ్యాక్టీరీనే నడుపుతున్నారు దుండగులు. ఆ ఫ్యాక్టరీలో బేబీ ఫార్మింగ్ జరుగుతుంది. 14 ఏళ్ల లోపున్న పిల్లలను అక్కడి తీసుకొచ్చి బలవంతంగా వారిని తల్లులుగా మార్చేస్తారు. వారికి పుట్టిన పిల్లలను పిల్లలు లేని వారికి అమ్మేస్తున్నారు. పిల్లలు లేని జంటల నుంచి…
ఈ భూప్రపంచంలో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి. కొన్ని వింతలు వినోదాన్ని కలిగిస్తే మరికొన్నిమాత్రం ఆలోచనలను, భయాన్ని కలిగిస్తాయి. ముస్లింలు ఎక్కువగా జరుపుకునే పండుగ బక్రీద్. ఆ పండుగ రోజున గొర్రెను బలి ఇస్తుంటారు. ప్రపంచంలో ఆ రోజుల గొర్రెల కొనుగోలు ఆమ్మాకాలు అధికంగా జరుగుతుంటాయి. అయితే, నైజీరియాలోని లాగోస్ మార్కెట్‌కు ఓ వ్యక్తి గొర్రెను అమ్మేందుకు తసుకొచ్చారు. సాధారణంగా గొర్రెలకు రెండు కొమ్ములు ఉంటాయి. కానీ, ఈ గొర్రెకు రెండు కాకుండా ఐదు కొమ్ములు ఉన్నాయి.…
కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతోన్న సమయంలోనే.. కరోనా కొత్త వేరియంట్లతో పాటు మరికొన్ని కొత్త వైర్‌లు కూడా వెలుగు చూస్తూ వస్తున్నాయి.. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది.. టెక్సాస్‌లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా మంకీపాక్స్ వైరస్ కేసు వెలుగుచూసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈ విషయాన్ని వెల్లడించింది.. కొన్ని రోజుల కిందట నైజీరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి అక్కడే మంకీపాక్స్ వైరస్ సోకి…
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొనడంతో 18 మంది మృతి చేందారు. పలువురికి తీవ్రమైన గాయాలయ్యాయి. నైజీరియాలోని జిగువా ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్లు అద్వాన్నంగా ఉండటం, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదానికి రాష్ డ్రైవింగ్ కారణం అయి ఉండోచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఓ బస్సు డ్రైవర్ కాలు విరిగిపోయింది. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అ…