Nigeria : ఉత్తర మధ్య రాష్ట్రం నైజీరియాలో జరిగిన ఊచకోతలో ఇప్పటివరకు 160 మంది మరణించారు. స్థానికులు బందిపోట్లుగా పిలిచే ముఠాలు ఆదివారం వివిధ వర్గాలపై దాడి చేశాయని స్థానిక అధికారి సోమవారం తెలిపారు.
Nigeria: ఆఫ్రికా దేశం నైజీరియాలో బందిపోట్లు రెచ్చిపోయారు. గుంపులుగా వచ్చి యూనివర్సిటీలో ఉన్న 24 మంది మహిళా విద్యార్థినులతో సహా 30 మందిని కిడ్నాప్ చేశారు. ఆయుధాలతో వచ్చిన వీరంతా లేడీస్ హాస్టళ్లలో నివసిస్తున్న వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వాయువ్య నైజీరియాలోని జంఫారా రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్ర రాజధాని గుసౌ వెలుపల ఉన్న ఫెడరల్ యూనివర్సిటీతో ఈ ఘటన జరిగింది.
Indian Sailors: నైజీరియాలో నిర్బంధించిన భారతీయ నావికులు తొమ్మిది నెలల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారి ముఖంలో ఆనందం వికసించింది.
ఉత్తర మధ్య నైజీరియాలో అమాయక ప్రజలపై ముష్కరులు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 29 మంది మరణించారు. సమీపంలోని గ్రామాలపై తుపాకులతో జరిపిన భీకర కాల్పుల్లో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు నైజీరియా అధికారులు వెల్లడించారు.
ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు రెచ్చిపోయారు. రెండు సార్లు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో సహా 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర-మధ్య నైజీరియా బెన్యూ రాష్ట్రంలోని ఉమోగిడి గ్రామంలో మార్కెట్ ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డారు.
Gunmen kill 12, including imam, abduct others from mosque in Nigeria: ఆఫ్రికా దేశం నైజీరియాలో ముష్కరులు ఘాతుకానికి పాల్పడ్డారు. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఇమామ్ తో సహా 12 మంది మరణించారు. మరికొంత మంది కిడ్నాప్ చేశారు. ఈ ఘటన నైజీరియా కట్సనా రాష్ట్రంలో జరిగింది. ఇది ప్రెసిడెంట్ మహ్మద్ బుహరీ సొంత రాష్ట్రం.