కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతోన్న సమయంలోనే.. కరోనా కొత్త వేరియంట్లతో పాటు మరికొన్ని కొత్త వైర్‌లు కూడా వెలుగు చూస్తూ వస్తున్నాయి.. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది.. టెక్సాస్‌లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా మంకీపాక్స్ వైరస్ కేసు వెలుగుచూసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈ విషయాన్ని వెల్లడించింది.. కొన్ని రోజుల కిందట నైజీరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి అక్కడే మంకీపాక్స్ వైరస్ సోకి ఉంటుందని పేర్కొంది.. ప్రస్తుతం డల్లాస్‌లోని ఓ ఆసుపత్రిలో బాధితుడిని ఐసొలేషన్‌లో ఉంచారు..
మంకీపాక్స్ వైరస్ ఎక్కువ శాతం జంతువులు, ఎలుకలు ఉంటుంది.. కొన్ని సార్లు జంతువుల నుంచి మానవులకు కూడా ఇది వ్యాపిస్తూ ఉంటుంది.. ఇక, మంకీపాక్స్ వైరస్ బాధితుడు కొన్ని రోజుల క్రితం నైజీరియా నుండి అమెరికాకు వచ్చాడు.. ఈ నెల 8,9 తేదీల్లో ఆ వ్యక్తి ప్రయాణించిన రెండు విమానాల్లో అతడితో కలిసి ఉన్న ఇతర ప్రయాణికులను ట్రేస్ చేసి వారికి పరీక్షలు నిర్వహించేందుకు ఎయిర్‌లైన్స్, స్థానిక ఆరోగ్య సంస్థలతో కలిసి ప్రయత్నిస్తున్నట్లు సీడీసీ పేర్కొంది. ప్రస్తుతం ఒక వ్యక్తికే మంకీపాక్స్ సోకినందున సాధారణ ప్రజలకు ఎలాంటి వ్యాప్తి ముప్పులేదని తెలిపింది. 2003లో అమెరికాలో 47 మందికి మంకీపాక్స్ సోకినట్లు వెల్లడించింది సీడీఎస్. ఇక, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం మంకీపాక్స్ మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే అరుదైన వైరస్..ఈ వైరస్ ఎక్కువగా కోతులు, ఎలుకల్లో ఉంటుంది. చాలా రేర్‌గా మనుషులుకు సోకే ప్రమాదం ఉంటుంది. మశూచి కంటే దీని వైరల్ ఇన్ఫెక్షన్ లెవల్ సీరియస్‌గా ఉంటుంది. ఈ వైరస్ సోకిన వాళ్లలో మొదట జలుబు, ఫ్లూ లక్షణాలే కనిపిస్తాయి. ఆ తర్వాత లింఫ్ నోడ్స్ వాపు రావడం, ముఖంతో పాటు శరీరం అంతా దద్దులు వస్తాయి అని చెబుతున్నారు… రెండు నుంచి నాలుగు వారాల్లోనే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోతుందని కూడా వెల్లడించారు అధికారులు.