ఆఫ్రికాలోని అనేక దేశాలు పేదరికంలో మగ్గుతున్నాయి. రోజువారి ఖర్చుల కోసం అక్కడి ప్రజలు ఏలాంటి పని చేయడానికైనా సిద్ధమవుతుంటారు. దీనిని కొందలరు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. వారీ జీవితాలతో ఆడుతుకుంటున్నారు. నైజీరియాలో పిల్లల కోసం ఓ ఫ్యాక్టీరీనే నడుపుతున్నారు దుండగులు. ఆ ఫ్యాక్టరీలో బేబీ ఫార్మింగ్ జరుగుతుంది. 14 ఏళ్ల లోపున్న పిల్లలను అక్కడి తీసుకొచ్చి బలవంతంగా వారిని తల్లులుగా మార్చేస్తారు. వారికి పుట్టిన పిల్లలను పిల్లలు లేని వారికి అమ్మేస్తున్నారు. పిల్లలు లేని జంటల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారు.
Read: ఎక్కడైనా టచ్ చేయండి… ఓపెన్ అవుతుంది…
పేదరికం కారణంగా చేసేదిలేక పిల్లలను కనేందుకు అనేకమంది యువతులు ఆ ఫ్యాక్టరీకి వస్తున్నారట. అక్కడి చట్టాల ప్రకారం 14 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లలు అబార్షిన్ చేయించుకోవడం నేరం. దీనిని తమకు అనుకూలంగా మార్చుకొని బేబీ ఫార్మింగ్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఒక్క నైజీరియాలోనే కాదు ఇలాంటి చీకటి వ్యాపారాలు అనేక దేశాల్లో కూడా జరుగుతున్నట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి.