నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొనడంతో 18 మంది మృతి చేందారు. పలువురికి తీవ్రమైన గాయాలయ్యాయి. నైజీరియాలోని జిగువా ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్లు అద్వాన్నంగా ఉండటం, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదానికి రాష్ డ్రైవింగ్ కారణం అయి ఉండోచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఓ బస్సు డ్రైవర్ కాలు విరిగిపోయింది. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అ దేశ ప్రధాని సంతాపం తెలియజేశారు. ఆ కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.