26/11 Mumbai terror attacks: 26/11 ముంబై ఉగ్రదాడులు సూత్రధారి తహవూర్ రాణాను అమెరికా, భారత దేశానికి అప్పగించనుంది. 2008లో జరిగి ఈ దాడి యావత్ దేశంతో పాటు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేసింది. నిందితులో్లో ఒకడిగా ఉన్న తహవూర్ రాణాను భారత్ కు అప్పగించడానికి అక్కడి కాలిఫోర్నియా కోర్టు అంగీకరించింది. భారత్-అమెరికాల మధ్య ఉన్న నేరస్తుల ఒప్పగింత ఒప్పందానికి అనుగుణంగా ఈ తీర్పు వచ్చింది.
West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని అక్రమ బాణసంచా తయారీ కర్మాగారంలో మంగళవారం జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కర్మాగారం పూర్తిగా ధ్వంసం అయింది. పేలుడు జరిగిన స్థలంలో చెల్లచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. పూర్బా మేదినీపూర్ లోని ఏగ్రాలో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు స్థానికుల్లో ఆగ్రహాన్ని పెంచింది. పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఘటన జరిగిన ప్రాంతం ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ పేలుడు సంభవించిన…
Nitin Gadkari: కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత నితిన్ గడ్కరీకి మరోసారి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికార నివాసంలోని ల్యాండ్ లైన్ నంబర్ కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి గడ్కరీ కార్యాలయ సిబ్బందికి ఫోన్ వచ్చిందని, కాల్ చేసిన వ్యక్తి తన వివరాలను పంచుకోకుండా, మంత్రితో మాట్లాడాలని, అతనిని బెదిరించాలని చెప్పినట్లు…
Ram Navami violence: రామ నవమి పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. రామనవమి ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో పాటు పలు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు. హౌరా, హుగ్లీ, దల్‌ఖోలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. తాజాగా ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేత దర్యాప్తు చేయించాలని గురువారం ఆదేశించింది.
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)ని లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) మంగళవారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.
NIA Probe Begins Into Attack On Indian Mission In London: ఖలిస్తానీ వేర్పాటువాదులు భారతదేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించిన సమయంలో ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో పలువరు ఖలిస్తాన్ వేర్పాటువాదులు భారత రాయబార కార్యాలయను టార్గెట్ చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో విజయవాడ NIA కోర్టులో ఇవాళ ( సోమవారం ) విచారణ జరిగింది. సీఎం జగన్ తరపున లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఎన్ఐఏ పలు అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని.. అలాగే కుట్ర కోణంపైనా దర్యాప్తు చేయలేదని.. కాబట్టి తదుపరి దర్యాప్తు అవసరం ఉందని వాదించారు.
PFI wanted Islamic Rule by waging war against govt: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హింసాత్మక మార్గాల ద్వారా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి, ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ తన ఛార్జిషీట్ లో పేర్కొంది. ఎన్ఐఏ ఈ కేసులో ఐదో ఛార్జీషీట్ లో 12 మంది పీఎఫ్ఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఎన్ఈసీ) సభ్యులు, వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులతో సహా…
NIA court convicts 8 suspected IS operatives: కాన్పూర్ ఉగ్రవాద కుట్ర కేసులో 8 మంది అనుమానిత ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. లక్నోలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ 8 మంది ఉగ్రవాద కుట్రలో పాలుపంచుకున్నారని కోర్టు వీరిని దోషులుగా నిర్దారించింది. ఉగ్రవాద అణిచివేతలో ఇది పెద్ద విజయం అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది. అయితే త్వరలోనే వీరందరికి కోర్టు శిక్ష విధిస్తుందని ఎన్ఐఏ తెలిపింది.