NIA Raids: గ్యాంగ్‌స్టర్లను వెంటాడుతున్న ఎన్‌ఐఏ.. కీలక సమాచారంతో 8 రాష్ట్రాల్లో దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA Raids: గ్యాంగ్‌స్టర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. గ్యాంగ్‌స్టర్లు, టెర్రర్ గ్రూపులు, డ్రగ్స్ మాఫియా మధ్య సంబంధానికి సంబంధించిన కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఎనిమిది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోందని అధికారులు తెలిపారు. దేశ రాజధాని, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో దాడులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండాను ప్రభుత్వం తీవ్ర ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఉగ్రవాదిగా ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఎన్‌ఐఏ నుంచి ఈ చర్య వచ్చింది.
ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలకు యువకులను రిక్రూట్ చేయడానికి, నిధుల సేకరణకు, విదేశాల్లోని క్రిమినల్ ముఠాలు పన్నుతున్న కుట్రపై దర్యాప్తు చేయడానికి ఎన్‌ఐఏ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నుంచి గత ఏడాది రెండు కేసులను తిరిగి నమోదు చేసింది. ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడంతో పాటు బెదిరించినట్లు కేసు నమోదు చేసింది. ఉత్తర భారత్‌లో ప్రత్యేకించి ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో మాఫియా కార్యకలాపాలు పెరుగుతున్నట్లు గుర్తించిన ఎన్‌ఐఏ.. గ్యాంగ్‌స్టర్లపై రెండు కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏకకాలంలో సోదాలు చేస్తోంది. ఒక్క పంజాబ్‌లోనే 30 ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
Javed Akhtar: పాక్‌లో జావెద్.. దాయాది దేశంలోనే 26/11 ఉగ్రవాదులపై సంచలన వ్యాఖ్యలు
నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ఓ గ్యాంగ్‌స్టర్‌పై నమోదైన కేసు విచారణలో భాగంగానే ఎన్‌ఏఐ ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్లను లక్ష్యంగా చేసుకుని ఇలా సోదాలు నిర్వహించడం ఇది నాలుగోసారి. కాగా.. దేశంలోని పులు నగరాల్లో గ్యాంగ్‌స్టర్లు ఉగ్రకార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఐఏ వీరిపై ఉక్కుపాదం మోపుతోంది.
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!