Kerala Bomb Blast: దేశంలో దాదాపుగా 10 ఏళ్ల కాలంగా ఎక్కడా కూడా బాంబు పేలుళ్లు చోటు చేసుకోలేదు. తాజాగా ఈ రోజు జరిగిన కేరళ వరస బాంబు పేలుళ్లతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. కేరళలో ఆదివారం ఉదయం జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో ఒకరు మరణించగా.. 36 మంది గాయపడ్డారు. కొచ్చిలో కన్వెన్షన్ సెంటర్ లో యోహోవా విట్‌నెస్ ప్రార్థనా సమావేశం ప్రారంభమైన కొద్ది…
Kerala: గతేడాది ఏప్రిల్‌లో కేరళకు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకుడు శ్రీనివాసన్ హత్య జరిగింది. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ దుమారాన్ని రేపింది. అధికార కమ్యూనిస్ట్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ కేసులో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక సభ్యుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది.
Udaipur Tailor Murder Case: గతేడాది రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్‌ని ఇద్దరు మతోన్మాదులు అత్యంత దారుణంగా తలను నరికి చంపారు. షాపులో పనిచేసుకుంటున్న సమయంలో కస్టమర్లుగా వచ్చిన రియాజ్ అట్టారి, మహ్మద్ గౌస్ కత్తితో తలను నరికేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మహ్మద్ ప్రవక్తపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన కారణంగా ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు.
NIA: ఖలిస్తాన్ ఉగ్రవాదులు, మద్దతుదారులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే)చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూకు సంబంధించిన, అతని కుటుంబం, సన్నిహితులకు సంబంధించిన ఆస్తుల్ని ఎన్ఐఏ జప్తు చేసింది.
మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీగా గుర్తించారు. ఈ ఉగ్రవాది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఇతనితో పాటు మరో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ అనుమానిత ఉగ్రవాదులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేరళ రైలు దహనం కేసులో నిందితుడిపై ఎన్ఐఏ (NIA) ఛార్జ్ షీట్ సిద్ధం చేసింది. నిందితుడు షారుక్ సైఫీ.. రాడికల్ వీడియోలు చూసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ఎన్ఐఏ చార్జిషీట్‌లో పేర్కొంది. అంతేకాకుండా.. చార్జిషీట్‌లో పలు విషయాలను వెల్లడించింది.
Khalistan: భారతదేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా ఖలిస్తాన్ ఉగ్రసంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో రాడికల్ సిక్కులు భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య చేయబడ్డాడు. ఇతను కూడా ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)పేరుతో ఉగ్రవాద సంస్థను నడుపుతున్నారు.
భారత్- కెనడా వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యతో భారత్ కు సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరిన సంగతి తెలిసిందే. అది చినికి చినికి గాలివానలాగా మారింది. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్ ముఠాలు కూడా భారత్ పై బెదిరింపులకు పాల్పడ్డాయి. దీంతో భారత్ వారిని ఎక్కడికక్కడ అణగద్రొక్కాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో భారతీయులను బెదిరించిన సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) నేత గురుపత్వంత్ సింగ్…
Khalistan: కెనడా, పాకిస్తాన్, యూకే, అమెరికాల్లో ఉంటూ ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడమే కాకుండా, పంజాబ్ రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదుల అణిచివేత ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. కెనడా-ఇండియాల మధ్య ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దౌత్య వివాదానికి కారణమైంది, ఇదే సమయంలో దేశం నుంచి పారిపోయిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, వేర్పాటువాదులపై భారత ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది.
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూపై కేంద్రం యాక్షన్ మొదలు పెట్టింది. ఇటీవల కెనడాలోని హిందువులు పారిపోవాలని హెచ్చరించాడు. గతంలో కూడా ఇలాగే ప్రధాని నరేంద్రమోడీ, మంత్రులు అమిత్ షా, జై శంకర్ ని హెచ్చరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైసంది.