Visakhapatnam: పాకిస్థాన్ అనుబంధంగా ఉన్న విశాఖపట్టణ నేవీ గూఢచర్య కేసులో మరో ఇద్దరు నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టు శిక్షలను విధించింది. సింపుల్ ఇంప్రిజన్ (SI)తో పాటు జరిమానా కూడా విధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో రాజస్థాన్‌లోని ఝున్‌ఝునూ జిల్లాకు చెందిన అశోక్ కుమార్, అల్వార్ జిల్లాకు చెందిన వికాస్ కుమార్‌లకు UA(P) చట్టం సెక్షన్ 18, అధికార రహస్యాల చట్టం (Official Secrets Act) సెక్షన్ 3 కింద ప్రతి…
ఉత్తరప్రదేశ్‌లో ఆరేళ్ల క్రితం మత ఘర్షణలో హత్యకు గురైన చందన్ గుప్తా కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 28 నిందితులకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ కోర్టు నిందితులకు శిక్షలు ఖరారు చేసింది. మొత్తం 11 మంది నిందితులకు పదేళ్ల చొప్పున శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్ట్ ఇవాళ తుది తీర్పును ఇచ్చింది.
కాన్పూర్‌లో రిటైర్డ్ టీచర్ రమేష్ బాబు శుక్లా హత్య కేసులో శిక్ష పడింది. రిటైర్డ్ ప్రిన్సిపల్ రమేష్ బాబు శుక్లా నుదుటిపై తిలకం, చేతికున్న కంకణాన్ని చూసి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ హత్య ఉదంతంపై అక్టోబర్ 2016న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే తాజాగా.. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీవ్రవాదులు అతిఫ్ ముజఫర్, మహ్మద్ ఫైజల్‌లకు మరణశిక్ష విధించింది.
Hand Chopping Case: 2010లో కేరళలో ఓ ప్రొఫెసర్ చేతిని నరికేసిన కేసులో ముగ్గురు నిందితులకు ఈ రోజు ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. సంచలనాత్మకమైన ఈ కేసులో నిషేధిత రాడికల్ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులుగా ఉన్న ఆరుగురిలో ముగ్గురికి కేరళలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది.
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు ఎట్టకేలకు శిక్ష పడింది. వీరికి గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లతో సంబంధాలు ఉన్నాయి.
Court Issues Warrant Against 23 Terrorists: జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ నుంచి బహిష్కరణకు గురైన 23 మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), పాకిస్తాన్ దేశాల్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం ఇది రెండోసారి. గతంలో 13 మంది ఉగ్రవాదులపై వారెంట్లు జారీ అయ్యాయి. కిష్త్వార్‌కు చెందిన 36 మంది వ్యక్తులు కొంతకాలంగా ఉగ్రవాదంలో చేరి పాకిస్తాన్‌కు వెళ్లారు. ఆ…
YS Jagan Attack Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విపక్షనేతగా ఉన్న సమయంలో.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనపై కత్తితో దాడి చేయడం సంచలనంగా మారింది.. అయితే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్‌ఐఏ కోర్టు.. ఇదే సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసుకు బెయిల్ నిరాకరించిన ఎన్ఐఏ కోర్టు… కేసులో బాధితుడి స్టేట్‍మెంట్ రికార్డు చేశామని ఎన్‍ఐఏ న్యాయవాది కోర్టుకు తెలపడంతో.. అసలు…
పాట్నా పేలుళ్ల కేసులో సంచలన తీర్పు వెలువరించింది ఎన్‌ఐఏ కోర్టు.. 2013 పాట్నాలోని గాంధీ మైదాన్‌లో వరుస బాంబు పేలుళ్ల కేసులో ఆరుగురు మరణించగా, 80 మంది గాయపడ్డారు.. ఈ కేసులో 10 మంది నిందితుల్లో తొమ్మిది మందిని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు అక్టోబర్ 27న దోషులుగా నిర్ధారించింది. ఇక, ఇవాళ వారికి శిక్షలు ఖరారు చేసింది.. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించగా, ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష, మరో ఇద్దరికి పదేళ్ల…
ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు పదేళ్ జైలు శిక్ష విధించింది.. ముజామిల్, సాదిక్, అక్రం అనే లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు.. హిందూ నేతలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులను హత మార్చేందుకు వ్యూహ రచన చేశారని.. వీరిని 2012లో అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు.. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్రలు కూడా చేసినట్టు నిర్ధారించారు.. సౌదీలో శిక్షణ తీసుకున్న అక్రం… హైదరాబద్ కు చెందిన…