Gokul Chat Bomb Blast: హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు.. దోషులకు పదేళ్ల జైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gokul Chat Bomb Blast: దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు ఎట్టకేలకు శిక్ష పడింది. వీరికి గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లతో సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఒబేదుర్ రెహమాన్‌తో పాటు ధనీష్ అన్సారీ, అఫ్తాబ్ ఆలం, ఇమ్రాన్‌ఖాన్‌లకు ఎన్‌ఐఏ కోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. గతంలో వివిధ పేలుళ్ల కేసులతో సంబంధం ఉన్న దోషులు. దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడి గందరగోళం సృష్టించేందుకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. ఈ నిషేధిత సంస్థ తరపున పనిచేస్తున్న ఈ నలుగురు సానుభూతిపరులు పేలుళ్ల కుట్రలో భాగమేనన్నారు. హైదరాబాద్, బెంగళూరు పేలుళ్లలోనూ ఈ నలుగురి హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ రుజువు చేసింది. వారణాసి, ముంబై, ఫజియాబాద్, ఢిల్లీ పేలుళ్లలో వీరి పాత్ర ఉందని చెప్పారు. తగిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించారు.
Read also: Burj Khalifa Dosa: బుర్జ్ ఖలీఫా దోశ తిన్నారో వావ్ అనాల్సిందే !
Also Read
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
- Off The Record: ఒకే పార్టీకి రెండు ఆఫీసులా..? అక్కడ బీజేపీలో పీక్స్‌కు చేరిన గ్రూప్ వార్..!
ఆగస్ట్ 25, 2007న కోఠిలోని గోకుల్ చాట్ మరియు లుంబినీ పార్క్ వద్ద ముఠా బాంబు దాడులు చేసింది. ఈ క్రూరమైన మారణకాండలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. లుంబినీ పార్క్ పేలుడులో 9 మంది మృతి.. గోకుల్ చాట్ షాపు పేలుడులో 33 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరు వికలాంగులు మరియు ఇప్పటికీ జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్ నగర్‌లో జంట పేలుళ్లు జరిగాయి. రద్దీగా ఉండే ఆనంద్ టిఫిన్ సెంటర్‌తో పాటు బస్టాండ్‌లో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులు చేయగా.. ఈ కేసులో ఐదుగురు నిందితులను ఎన్ఐఏ అప్పట్లో అరెస్ట్ చేసింది.
Student Suicide: నా పిల్ల నన్ను మోసం చేసింది.. ‘అమ్మా సారీ’ అంటూ సెల్ఫీ వీడియో..!
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!