కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది రామారావు హెచ్‌ఆర్సీలో ఈ ఫిర్యాదు చేశారు.. కాంగ్రెస్ పార్టీ శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తోందని తన ఫిర్యాదులో ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా వారి వ్యవహారం ఉందంటూ హెచ్ఆర్సీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. Read Also: Rahul Gandhi in Pub: సాయిరెడ్డికి ఠాగూర్ స్ట్రాంగ్…
ఏపీలో జరుగుతున్న వివిధ సంఘటనలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చిలమత్తూరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్ హెచ్చార్సీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడు వేణుగోపాల్ పై ఎస్ఐ దాడి చేసిన వీడియోను ఎన్ హెచ్చార్సీకి పంపించారు వర్ల. సత్యసాయి జిల్లా, చిలమత్తూరు ఎస్.ఐ రంగడుపై చర్యలు తీసుకోవాలని వర్ల లేఖలో కోరారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ లో…
తెలంగాణలో పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులు, రైతులు నష్టపోయిన తీరుపై ఎలాంటి పరిహారం ఇచ్చారో చెప్పాలని జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) రాష్ర్టప్రభుత్వాన్ని, కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశంచింది. దీనిపై 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సరైన అధ్యయనం చేయకుండానే ప్రాజెక్టును నిర్మించడంతో 50వేల ఎకరాలకు మేర సారవంతమైన పంట భూములు మునిగిపోయాయి. దీంతో రైతులతో పాటు కౌలు రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారని న్యాయవాది శ్రవణ్ NHRC…
కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు అంశం మళ్ళీ తెరమీదకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం చేసి 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్సీ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందంటూ ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు న్యాయవాది శ్రావణ్. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఇటీవల 30 నుంచి 40వేల…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ… రైతులు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీ సరిహద్దులు నిరసనలతో హోరెత్తుతున్నాయి. రైతులు ఢిల్లీ రాకుండా రోడ్లను మూసేశారు. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో నెలలతరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఇదే విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. గమ్యస్థానాలకు చేరుకోవడానికి, చుట్టూ తిరిగి చాలాదూరం ప్రయాణించాల్సి వస్తోందని జాతీయ మానవహక్కుల…
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి చర్యలు తీసుకోకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్‌లో ఇరు రాష్ట్రాల సీఎస్‌లను ఆదేశించింది ఎన్‌హెచ్‌ఆర్సీ. దీంతో ప్రభుత్వాల నుంచి స్పందన లేక పోవడంతో సీరీయస్ అయ్యింది. ఆత్యహత్యలకు సంబంధించి ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. లేకపోతే తమ ముందు హాజరు కావాలని హెచ్చరించింది ఎన్‌హెచ్‌ఆర్సీ.