తెలంగాణలో పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులు, రైతులు నష్టపోయిన తీరుపై ఎలాంటి పరిహారం ఇచ్చారో చెప్పాలని జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) రాష్ర్టప్రభుత్వాన్ని, కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశంచింది. దీనిపై 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సరైన అధ్యయనం చేయకుండానే ప్రాజెక్టును నిర్మించడంతో 50వేల ఎకరాలకు మేర సారవంతమైన పంట భూములు మునిగిపోయాయి.
దీంతో రైతులతో పాటు కౌలు రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారని న్యాయవాది శ్రవణ్ NHRC లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించి విచారించిన NHRC ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లో నివేదిక ఇవ్వకపోతే తదుపరి తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని కేంద్ర పర్యావరణ శాఖ, రాష్ర్ట ప్రభుత్వాన్ని హెచ్చరించింది.