రైతు నిరసలనపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ.. 4 రాష్ట్రాలకు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ… రైతులు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీ సరిహద్దులు నిరసనలతో హోరెత్తుతున్నాయి. రైతులు ఢిల్లీ రాకుండా రోడ్లను మూసేశారు. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో నెలలతరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఇదే విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. గమ్యస్థానాలకు చేరుకోవడానికి, చుట్టూ తిరిగి చాలాదూరం ప్రయాణించాల్సి వస్తోందని జాతీయ మానవహక్కుల కమిషనర్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్రంతో పాటు నాలుగు రాష్ట్రాలను ఆదేశించింది.
ఇక రైతుల ఆందోళనలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం కన్పిస్తోందని ఎన్‌హెచ్‌ఆర్సీ అభిప్రాయపడింది. పారిశ్రామిక రంగంపై అన్నదాతల ఆందోళనల ప్రభావం అన్న అంశంపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఒక సమగ్ర నివేదికను వచ్చేనెల 10 లోగా సమర్పించాలని ఆదేశించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. కాగా, రైతుల ఆందోళనపై మొదట్లో పట్టించుకోని కేంద్రం.. ఆ తర్వాత కొన్ని దపాలుగా చర్చలు జరిపింది.. చర్చలు సఫలం కాకపోవడంతో.. రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!