Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ చిక్కుల్లో పడ్డాడు. అనవసరంగా చేసిన గెస్ట్ రోల్ ఆయన మెడకు చుట్టుకుంది. ఆయనపై కేసు పెట్టాలంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కమిషన్ ఆర్డర్ వేసింది. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీలు నటించారు. రణ్ బీర్ కపూర్ కూడా సీన్ లో గెస్ట్ రోల్ చేశాడు. అందులో…
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది..
Congress: జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ను ఎంపిక అయ్యారు. అయితే, ఛైర్మన్ ఎంపికలో సరైన విధానాన్ని పాటించలేదని కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.
ఈ డిసెంబర్ నెల 5వ తేదీన పుష్ప 2 సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అయింది. అయితే ఒక రోజు ముందుగానే హైదరాబాదులో ఉన్న సింగిల్ స్క్రీన్స్ తో పాటు కొన్ని మల్టీప్లెక్స్ లలో పుష్ప సినిమాను ప్రీమియర్ గా ప్రదర్శించారు. అందులో సంధ్య థియేటర్ ప్రీమియర్స్ కోసం అల్లు అర్జున్ తో పాటు ఆయన కుటుంబం, హీరోయిన్ రష్మిక కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలిసి ఆ సంధ్య థియేటర్ కి ఫ్యాన్స్…
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి.. అయితే, ప్రతి కార్యకర్తకు మేం అండగా నిలబడతాం అన్నారు.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 57 మంది సోషల్ యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించారు.. 12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదన్నారు.
పోలీసు కస్టడీ మరణాల్లో దేశంలో గుజరాత్ టాప్ స్థానంలో ఉంది. దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్ లో శుక్రవారం మాల్దా పట్టణంలో జరిగిన బాణాసంచా పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు ఇటీవలి నివేదికలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మీడియా నివేదికను సుమోటగా పరిగణలోకి తీసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో అనుమతి ఉన్నప్పటికీ రామనవమి ఊరేగింపుపై దుండగులు దాడి చేశారని ఆరోపించిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) పరిగణలోకి తీసుకుంది. ఈ అంశంపై విచారణ జరిపి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హౌరా కమిషనర్ ఆఫ్ పోలీస్‌లకు హక్కు సంఘం నోటీసులు జారీ చేసింది.
గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు అసద్ ఎన్ కౌంటర్ పై ఉత్తర్ ప్రదేశ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ ఎన్ కౌంటర్ పై రాష్ట్రంలోని విపక్ష పార్టీలు యోగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఈ అంశంపై విపక్ష సమాజ్ వాదీ పార్టీ తీవ్రంగా స్పందించింది.
ఏపీ డీజీపీకి రాజేంద్రనాథ్ రెడ్డికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీచేసింది. చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ ఇంట్లో పని చేస్తోన్న దళిత మహిళను వేధిస్తోన్న ఘటనలో డీజీపీకి NHRC నోటీసులు ఇచ్చింది. దళిత మహిళపై దొంగతనం బనాయించి అక్రమంగా కేసు పెట్టారంటూ NHRCకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నేరం ఒప్పుకోవాలంటూ దళిత మహిళ ఉమా మహేశ్వరిని కస్టోడియల్ టార్చర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు వర్ల…