Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ చిక్కుల్లో పడ్డాడు. అనవసరంగా చేసిన గెస్ట్ రోల్ ఆయన మెడకు చుట్టుకుంది. ఆయనపై కేసు పెట్టాలంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కమిషన్ ఆర్డర్ వేసింది. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీలు నటించారు. రణ్ బీర్ కపూర్ కూడా సీన్ లో గెస్ట్ రోల్ చేశాడు. అందులో ఎలక్ట్రిక్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఈ సీన్ పై ఎన్ హెచ్ ఆర్సీ సీరియస్ అయింది. ఎందుకంటే ఇండియాలో ఎలక్ట్రిక్ సిగరెట్లకు 2009లో చట్టం తీసుకువచ్చారు.
Read Also : OG : ఆ ముగ్గురి ఆశలు పవన్ కల్యాణ్ మీదే..
ఆ చట్టాన్ని బ్రేక్ చేస్తూ ఎలక్ట్రిక్ సిగరెట్ తాగాడని.. యూత్ ను పెడదోవ పట్టించేలా నటించాడంటూ ఎన్ హెచ్ ఆర్ సీ సీరియస్ అయింది. ఆయనపై కేసు నమోదు చేయాలని ప్రసార శాఖకు ఆదేశాలు జారీ చేస్తూ నోటీసులు కూడా జారీ చేసింది. రణ్ బీర్ తో పాటు నెట్ ఫ్లిక్స్ సంస్థ, నిర్మాతలపై కూడా కేసులు నమోదు చేయాలని ఆర్డర్ వేసింది. దీంతో రణ్ బీర్ కపూర్ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వివాదంపై ఏమైనా స్పందిస్తాడా లేదా అన్నది చూడాలి.
Read Also : OG : పవన్ కల్యాణ్ ఏం ధరించాడో గమనించారా..?