ఇండియా న్యుజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ నిన్న ప్రారంభమైన బిషయం తెలిసిందే. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 221 పరుగులు చేసిన భారత జట్టు ఈరోజు 325 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. అయితే అంతరం బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ కు మన భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఈ రెండో రోజు రెండో సెషన్ ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు కేవలం 38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అందులో యువ పేసర్ సిరాజ్ ఒక్కడే మూడు వికెట్లు తీయగా అశ్విన్, అక్షర్, జయంత్ ఒక్కో వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక కివీస్ జట్టు ఇంకా టీం ఇండియా కంటే 286 పరుగులు వెనకబడి ఉంది. ఒకవేళ ఈరోజు కివీస్ ను మన బౌలర్లు ఆల్ ఔట్ చేస్తే ఫాలో ఆన్ పద్దతిలో మళ్ళీ వల్లే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.