మొన్నటి వరకు కరోనా మహమ్మారి కేసులు.. మన దేశంలో తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే… తాజాగా కరోనా మహమ్మారి… ఒమిక్రాన్ రూపాంతరం చెంది… పంజా విసురుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇక ఈ వైరస్ ఎఫెక్ట్.. భారత్ – న్యూజిలాండ్ రెండో టెస్ట్ పై పడింది. న్యూజిలాండ్ తో రెండో టెస్ట్ కు… లిమిటెడ్ గానే… ప్రేక్షకులను అనుమతి ఇస్తామని పేర్కొంది ముంబై క్రికెట్ అసోషియేషన్.
ఈ నేపథ్యంలోనే… 33 వేలు ఉన్న వాంఖడే స్టేడియ సామర్థ్యంలో… 25 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నారు అధికారులు. కరోనా నేపథ్యంలో… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే మ్యాచ్ నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. కాగా.. భారత్ – న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 3 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ డ్రా గా ముగిసింది.