భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్సులో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్(1)ను న్యూజిలాండ్ బౌలర్ జేమీసన్ బౌల్డ్ చేశాడు. క్రీజులో మయాంక్ అగర్వాల్ (4), పుజారా (9) ఉన్నారు. మన బ్యాట్స్‌మెన్ నాలుగో రోజు ఆటలో ఎంత సేపు బ్యాటింగ్ చేస్తారన్న దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతానికి భారత్ 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Read Also: నవంబర్ మాసం ఆ రెండు చిత్రాలదే!
అయితే తొలి టెస్టులో చెత్త అంపైరింగ్‌తో అంపైర్లు నితిన్ మీనన్, వీరేందర్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మూడు రోజుల ఆటలో వీరిద్దరూ ఐదు తప్పిదాలకు పాల్పడినట్లు కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు. ఈ టెస్టులో భారత బౌలర్లకు కొరకాని కొయ్యగా మారిన టామ్ లాథమ్ 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఆజింక్యా రహానె రివ్యూ తీసుకోకపోవడంతో లాథమ్ బతికిపోయాడు. అంతకుముందు పలు మార్లు రివ్యూలలో లాథమ్ బతికిపోయాడు. దీంతో రహానె రివ్యూ తీసుకునేందుకు ఇష్టపడలేదు.
Latham out LBW at 66, given not out, review not taken by India.
— Bhupesh Juneja (@BhupeshJuneja1) November 27, 2021
Are the matches going to get decided on the basis of a team’s judgment to take (or not to) DRS? pic.twitter.com/WzDoWrTQri