New Zealand win toss, opt to field against India in 1st ODI: న్యూజిలాండ్, ఇండియాల మధ్య ఈ రోజు (శుక్రవారం) తొలి వన్డే జరగనుంది. అక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా ఈ వన్డే జరగనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్ ను 1-0తో సొంతం చేసుకున్న భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు సొంతదేశంలో టీ20 సిరీస్ కోల్పోయింది న్యూజిలాండ్. ఎలాగైన వన్డే సిరీస్…
IND Vs NZ: నేపియర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టీ20 టైగా ముగిసింది. టీమిండియా ఇన్నింగ్స్ 9వ ఓవర్ ముగిసిన తర్వాత వర్షం పడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ టై అయిందని అంపైర్లు ప్రకటించారు. డీఎల్ఎస్ ప్రకారం స్కోర్లు సమం అయ్యాయని తెలిపారు. తొలుత న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.…
IND Vs NZ: నేపియర్ వేదికగా మెక్లీన్ పార్క్‌లో టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. దీంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ డెవాన్ కాన్వే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతడికి గ్లెన్ ఫిలిప్స్ సహకారం అందించాడు. అయితే వీళ్లిద్దరూ మిగతా బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో కివీస్ పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌట్ అయ్యింది. అయితే కాన్వే, ఫిలిప్స్ కారణంగా న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.…
IND Vs NZ: టీమిండియాతో జరిగిన రెండో టీ20లో ఓటమి పాలైన న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టీ20కి కెప్టెన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ జట్టు స్వయంగా ప్రకటించింది. అతడి స్థానంలో పేసర్ టిమ్ సౌథీకి జట్టు పగ్గాలు అందిస్తున్నట్లు వెల్లడించింది. గతంలో కేన్ విలియమ్సన్ మెడికల్ అపాయింట్మెంట్ తీసుకున్నాడని.. అయితే అదే సమయంలో మ్యాచ్ జరుగుతుండటంతో అతడు దూరమయ్యాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వివరించింది. చాలాకాలంగా విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడని..…
IND Vs NZ: మౌంట్ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన రిషబ్ పంత్ (6) తీవ్రంగా నిరాశపరిచాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 36 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ (13), హార్దిక్ పాండ్యా (13) కూడా పెద్దగా రాణించలేదు. అయితే కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో…
IND Vs NZ: టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత టీమిండియా నేరుగా న్యూజిల్యాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఈ క్రమంలోనే ఆదివారం నాడు రెండో టీ20 జరగనుంది. బే ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా యువ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే…
IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో టీ 20 జరగనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో భారత యువ జట్టు కివీస్‌తో తలపడనుంది. టీ 20 వరల్డ్‌కప్ సెమీస్‌లో ఓటమి తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు…
IND Vs NZ: వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడా? కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తాడా? పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి.
IND Vs NZ: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ20లో తలపడనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, దినేష్ కార్తీక్ లాంటి సీనియర్లు ఈ సిరీస్‌లో ఆడటం లేదు. సీనియర్ల గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా జట్టుకు నేతృత్వం వహిస్తాడు. హెడ్ కోచ్ రాహుల్…
Hardik Pandya: ఈ నెల 18 నుంచి జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత్, న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, విలియమ్సన్ ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఓడిపోయినందుకు నిరాశగా ఉందన్నాడు. అయితే విజయం సాధించేందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని.. తప్పులను సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. 2024 టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే…