IND Vs NZ: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. మూడో టీ20కి కెప్టెన్ విలియమ్సన్ దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs NZ: టీమిండియాతో జరిగిన రెండో టీ20లో ఓటమి పాలైన న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టీ20కి కెప్టెన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ జట్టు స్వయంగా ప్రకటించింది. అతడి స్థానంలో పేసర్ టిమ్ సౌథీకి జట్టు పగ్గాలు అందిస్తున్నట్లు వెల్లడించింది. గతంలో కేన్ విలియమ్సన్ మెడికల్ అపాయింట్‌మెంట్ తీసుకున్నాడని.. అయితే అదే సమయంలో మ్యాచ్ జరుగుతుండటంతో అతడు దూరమయ్యాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వివరించింది. చాలాకాలంగా విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడని.. ఇటీవల అతడు ఫామ్ కోల్పోవడానికి కూడా అదే కారణమని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. అయితే ఇప్పుడు విలియమ్సన్ తీసుకున్న మెడికల్ అపాయింట్‌మెంట్ దేనికోసమో స్పష్టంగా తెలియదన్నాడు.
Read Also: Vijay Hazare 2022: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన సీఎస్‌కే ఆటగాడు
Also Read
- India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
మూడో టీ20కి కేన్ విలియమ్సన్ దూరం కావడంతో అతడి స్థానంలో మార్క్ చాప్‌మన్ ఆడుతున్నట్లు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించాడు. చాప్‌మన్ చివరగా టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడినట్లు తెలిపాడు. టీమిండియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ సమయానికి విలియమ్సన్ తిరిగి వస్తాడని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. బుధవారం నాటికి ఆక్లాండ్‌లో జట్టుతో కలుస్తాడని చెప్పాడు. తమకు అతడు విలువైన ఆటగాడు అని.. బ్యాటింగ్ లైనప్‌లో వైవిధ్యం తెస్తాడని హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. కాగా రెండో టీ20లో విలియమ్సన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో అతడు 61 పరుగులు చేశాడు.
భారత్‌తో మంగళవారం జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌కు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ దూరమయ్యాడు. అతడి స్థానంలో టిమ్ సౌథీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆదివారం జరిగిన రెండో టీ20లో 65 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించింది.#NZvsIND #KaneWilliamson pic.twitter.com/G3fUQtYGYV
— AIR News Hyderabad (@airnews_hyd) November 21, 2022
Read Also: Teja Sajja: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్’ టీజర్!
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..