IND Vs NZ: నేపియర్ వేదికగా మెక్‌లీన్ పార్క్‌లో టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. దీంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ డెవాన్ కాన్వే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతడికి గ్లెన్ ఫిలిప్స్ సహకారం అందించాడు. అయితే వీళ్లిద్దరూ మిగతా బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో కివీస్ పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌట్ అయ్యింది. అయితే కాన్వే, ఫిలిప్స్ కారణంగా న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. నిజానికి భారీ స్కోరు దిశగా వెళ్తున్న కివీస్‌ను భారత బౌలర్లు అడ్డుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ చెరో 4 వికెట్లతో చెలరేగారు. భువనేశ్వర్‌కు వికెట్లు ఏమీ దక్కలేదు. చాహల్ బౌలింగ్‌లో మూడు ఓవర్లలో 35 పరుగులు పిండుకున్నారు. హర్షల్ పటేల్ ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. గత మ్యాచ్ హీరో దీపక్ హుడా చేత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక్క ఓవర్ మాత్రమే వేయించాడు. హుడా ఒక్క ఓవర్ వేసి మూడు పరుగులు ఇచ్చాడు.
Read Also: Tollywood: ఈ వీకెండ్ మూవీస్ ఇవే!
కాగా ఈ మ్యాచ్‌కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. గతంలో తీసుకున్న మెడికల్ అపాయింట్‌మెంట్ ఉండటంతో అతను ఈ మ్యాచ్ ఆడలేదు. అతని స్థానంలో యువ ఆటగాడు మార్క్ చాప్‌మాన్‌ను తీసుకున్నట్లు తాత్కాలిక కెప్టెన్ సౌథీ వెల్లడించాడు. టాస్ గెలవగానే సౌథీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నామని హార్దిక్ పాండ్యా చెప్పాడు. పిచ్ కొద్దిగా పచ్చగా ఉందని, దీని వల్ల పేసర్లకు కొంత మూవ్‌మెంట్ దొరుకుతుందని అభిప్రాయపడ్డాడు.
Read Also: Srikanth: విడాకుల పుకార్లను ఖండించిన శ్రీకాంత్.. ఆ వెబ్‌సైట్స్‌పై చర్య