Tim Southee: న్యూజిలాండ్ స్టార్ బౌలర్ టిమ్ సౌథీ అరుదైన రికార్డు సృష్టించాడు. క్రికెట్‌లో ఇతర ఆటగాళ్లకు సాధ్యం కాని రీతిలో అతడు అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ధావన్ వికెట్ తీసిన వెంటనే సౌథీ ఈ రికార్డు అందుకున్నాడు. టెస్టుల్లో 300 వికెట్లు, వన్డేల్లో 200 వికెట్లు, టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు. ఇప్పటివరకు సౌథీ టెస్టుల్లో 347 వికెట్లు, వన్డేల్లో 202 వికెట్లు, టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టాడు. అలాగే వన్డేల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరిన ఐదో కివీస్ బౌలర్‌గా నిలిచాడు.
Read Also: Meet Cute Review: మీట్ క్యూట్ (ఐదు కథల సమాహారం)
ఇప్పటివరకు వన్డే కెరీర్‌లో 149 వన్డేలు ఆడిన సౌథీ 202 వికెట్లు పడగొట్టాడు. సగటు 33.83గా నమోదైంది. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 33/7. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. డేనియల్ వెటోరీ 297 వికెట్లు సాధించగా కైల్ మిల్స్ 240 వికెట్లు తీశాడు. క్రిస్ హారిస్ 203 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. క్రిస్ కెయిన్స్ కూడా 200 వికెట్లు సాధించాడు. ఓవరాల్‌గా న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో 200 వికెట్లు సాధించిన ఐదో బౌలర్‌గా సౌథీ నిలిచాడు. కాగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో సౌథీ మొత్తం 4 వికెట్లు సాధించాడు.
Read Also: Ambati Rambabu: ఆఖరి ఛాన్స్ అంటే అధికారం రాదు.. ప్రజల మెప్పు పొందాలి