New Zealand win toss, opt to field against India in 1st ODI: న్యూజిలాండ్, ఇండియాల మధ్య ఈ రోజు (శుక్రవారం) తొలి వన్డే జరగనుంది. అక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా ఈ వన్డే జరగనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్ ను 1-0తో సొంతం చేసుకున్న భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు సొంతదేశంలో టీ20 సిరీస్ కోల్పోయింది న్యూజిలాండ్. ఎలాగైన వన్డే సిరీస్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఆతిథ్య కివీస్ జట్టు ఉంది.
శుక్రవారం జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ట్రెంట్ బౌల్ట్, మార్టిన్ గప్తిల్ లేకుండా తొలి వన్డే ఆడుతోంది కివీస్ జట్టు. భారత్ తరుపున అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ ఇద్దరూ తొలిసారిగా వన్డే ఇంటర్నేషనల్ అరంగ్రేటం చేస్తున్నారు. పిచ్ పై పచ్చిక ఉండటంతో బౌలింగ్ కు అనుకూలించేలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షం కారణంగా మూడు టీ20 మ్యాచుల్లో రెండు మ్యాచులకు అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మొదటి టీ20 పూర్తిగా రద్దు కాగా.. మూడో టీ20 మ్యాచ్ ‘టై’గా ముగిసింది.
Read Also: BJP: శ్రద్ధా వాకర్ హత్యపై ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మౌనంగా ఉంటున్నారు..?
జట్ల వివరాలు:
భారత్ (ప్లేయింగ్ XI) – శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ (సి), రిషబ్ పంత్ (WK), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్ (అరంగేట్రంలో), అర్ష్దీప్ సింగ్ (అరంగేట్రం), యుజ్వేంద్ర చాహల్.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI) – ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (సి), టామ్ లాథమ్ (WK), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ , టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్.