Team India: శ్రీలంకతో వన్డే సిరీస్ పూర్తి కాగానే న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈనెల 18 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. అనంతరం మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీలను బీసీసీఐ మరోసారి దూరంపెట్టింది. ఈ మేరకు న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లతో పాటు ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు సెలక్టర్లు భారతజట్టును ప్రకటించారు. వన్డే సిరీస్‌కు రోహిత్ సారథ్యం వహించనుండగా..…
పంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. అందరికంటే ముందే న్యూజిలాండ్ ఆక్లాండ్ వాసులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. మధుర జ్ఞాపకాలను మదిలో దాచుకుంటూ 2022కి గుడ్‌బై చెప్పిన ఆక్లాండ్ వాసులు.. కోటి ఆశలతో ప్రపంచంలోనే అందరికంటే ముందే 2023కి స్వాగతం పలికారు.
Stump Out: ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా తొలి టెస్టు జరుగుతోంది. అయితే ఈ టెస్టులో అరుదైన సీన్ చోటు చేసుకుంది. దీంతో 145 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చూడని రికార్డును న్యూజిలాండ్ కీపర్ బ్లండెల్ సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా తొలి రెండు వికెట్లను స్టంపౌట్ రూపంలోనే కోల్పోయింది. అబ్దుల్లా షఫిఖ్ (7), షాన్…
తెలుగు రాష్ట్రాలలో క్రికెట్ ప్రియులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. బంగ్లాదేశ్‌తో సిరీస్ తర్వాత టీమిండియా స్వదేశంలో వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లు ఆడనుంది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. వీటిలో హైదరాబాద్, విశాఖలకు కూడా మ్యాచ్‌లను కేటాయించింది. జనవరి 18న హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో టీమిండియా తొలి వన్డే ఆడనుండగా… మార్చి 19న విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడనుంది. మూడు నెలల కాలంలో తెలుగు రాష్ట్రాలలో రెండు అంతర్జాతీయ…
న్యూజిలాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. మూడు వన్డేల సిరీస్ న్యూజిలాండ్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి వన్డేను న్యూజిలాండ్ గెలుచుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం.
IND Vs NZ: క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ తడబడింది. సిరీస్ సమం కావాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ధావన్ సేన 47.3 ఓవర్లలో 219 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సుందర్ రాణించకపోతే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉండేది. అతడు 51 పరుగులతో రాణించాడు. సుందర్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతకుముందు ఓపెనర్లు ధావన్ (28), గిల్ (13) విఫలమయ్యారు.…
IND Vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఆడిన జట్టునే మూడో వన్డేలో టీమిండియా కొనసాగించింది. అటు న్యూజిలాండ్ మాత్రం ఓ మార్పు చేసింది. రెండో వన్డేలో ఆడిన బ్రాస్‌వెల్‌ను పక్కనపెట్టి ఆడమ్ మిల్నేను జట్టులోకి తీసుకుంది. వన్డే సిరీస్ కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పనిసరి గెలవాలి. మూడు మ్యాచ్‌ల ఈ…
హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. భారత్ 12.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 89 పరుగులు చేసిన సమయంలో వర్షం ఆటకు అంతరాయం కలగడంతో చివరికి ఆట రద్దయింది.
హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించినప్పటికీ.. మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించి ఆటను ప్రారంభించారు. వర్షం తగ్గిపోవడంతో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.