బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి” ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. కరోనా తర్వాత బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి, రికార్డ్ సృష్టించిన ఈ మూవీ ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా ఈ టాప్ డిజిటల్ స్ట్రీమింగ్ పై సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కొత్త అనుమానాలు రేకెత్తించేలా నెట్ ఫ్లిక్స్ ఓ పొరపాటు చేసింది.
Read Also : Shaakuntalam : సామ్ బర్త్ డే స్పెషల్… ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్
“గంగూబాయి కతియావాడి” తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను ప్రీమియర్ చేసిన నెట్ ఫ్లిక్స్ కొన్ని గంటల తరువాత దాన్ని తొలగించింది. దీంతో అప్పటిదాకా సినిమాను చూసిన ప్రేక్షకులకు ఈ అనుకోని ఘటన ఆందోళకు గురి చేసింది. అసలు ముందుగా ఎందుకు ప్రీమియర్ చేశారు? ఇప్పుడు ఎందుకు తొలగించారు అంటూ సోషల్ మీడియా వేదికగా నెట్ ఫిక్స్ ను ప్రశ్నిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం “గంగూబాయి కతియావాడి”ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని, అందుకే ఇలా డబ్బింగ్ వెర్షన్ ను తొలగిస్తున్నారని అంటున్నారు. మరి “గంగూబాయి కతియావాడి” విషయంలో అసలేం జరుగుతుందనేది తెలియాలంటే మేకర్స్ స్పందించాల్సిందే. అయితే వాస్తవానికి గంగూబాయి ముంబైలోని కమాటిపురకు చెందిన సంఘ సంస్కర్తగా మారిన వేశ్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అంతేకాదు ఇది ప్రాంతీయ చిత్రం. కాబట్టి తెలుగు ప్రేక్షకులకు సినిమా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నారు. మరి నెట్‌ఫ్లిక్స్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను తీసేయడానికి కారణం ఏంటో చూడాలి.