బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. గత నెల రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కామాతిపుర రాజ్యానికి గంగుబాయి మాఫియా క్వీన్‌గా ఎలా మారింది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి బాలీవుడ్ స్టామినాను మరోసారి నిరూపించింది. ఇక కరోనా ప్యాండమిక్ తరువాత ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా రికార్డులను బ్రేక్ చేసే కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఇక ఈ సినిమా విజయవంత కావడంతో ఎప్పుడెప్పుడు ఓటిటీలోకి అడుగుపెట్టనున్నదో అని ప్రేక్షకులను ఎంతో ఆసక్తి కరంగా ఎదురుచూస్తున్నారు. బాలీవడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెల చివరి వారంలో స్ట్రీమింగ్ కానున్నది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 25 న ఓటిటీ లో రిలీజ్ కానుంది. అయితే ఈ డేట్ అలియాకు ఎంతో ముఖ్యమని చెప్పాలి. ఇదే రోజున అలియా తెలుగు డెబ్యూ ఆర్ఆర్ఆర్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన చుస్తే అలియాకు రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఒకపక్క థియేటర్లో ప్రేక్షకులను .. ఇంకోపక్క ఓటిటీ ప్రేక్షకులను అలరించాలి. అలియాకు ఆరోజు పెద్ద పరీక్షనే ఉంది అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. మరి ఈ పరీక్షలో ఈ ముద్దగుమ్మ పాస్ అవుతుందో లేదో చూడాలి.