ఇకపై పాలస్తీనా రాజ్యం ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. పాలస్తీనా రాజ్య స్థాపనకు ఆయా దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేస్తామంటూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: Rajnath Singh: ఆపరేషన్ సిందూర్-2, 3 పార్టులు పాక్ తీరుపై ఆధారపడి ఉంటుంది
ఈనెలాఖరు ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు నెతన్యాహు అమెరికా వెళ్తున్నారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌కు రావాలని నెతన్యాహుకు ట్రంప్ ఫోన్ చేసి ఆహ్వానించారు. ఇక ఇంతలోనే ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇక మా దేశంలో మధ్యలో ఒక ఉగ్రవాద రాజ్యాన్ని బలవంతంగా ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు జరగనివ్వబోమన్నారు. అమెరికా నుంచి వచ్చాక దీనిపై కీలక ప్రకటన ఉంటుందని నెతన్యాహు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Charlie Kirk: ట్రంప్ సమక్షంలో చార్లీ కిర్క్ భార్య ఎరికా కీలక ప్రకటన
అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదుల ఊచకోత తర్వాత పాలస్తీనాకు మద్దతిస్తున్నా నాయకులకు మా దగ్గర స్పష్టమైన సందేశం ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక పాలస్తీనా రాజ్యం ఉండదని పేర్కొంది. జోర్డాన్ నదికి పశ్చిమాన పాలస్తీనా రాజ్యం ఉండబోదని ఇజ్రాయెల్ పీఎంవో స్పష్టం చేసింది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై ప్రతిస్పందన ఉంటుందని నెతన్యాహు కార్యాలయం వెల్లడిచింది.
అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆనాటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. అయితే అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా కొంతమంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఇంకా 40, 50 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నారు. ఒకేసారి విడిచిపెట్టాలని అమెరికా ఒత్తిడి చేసింది. కానీ విడిచిపెట్టలేదు. దీంతో గాజా స్వాధీనం కోసం ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. దీంతో భీకరదాడులు చేస్తోంది. ఇక ఖతార్‌లో హమాస్ నేతలు ఉన్నారన్న సమాచారంతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి.
Prime Minister Benjamin Netanyahu: "There will be no Palestinian state. The response to the latest attempt to force upon us a terror state in the heart of our land will be given after my return from the United States"
"I have a clear message to those leaders who are recognizing… pic.twitter.com/1RyGknKZRC
— ANI (@ANI) September 22, 2025