Netanyahu: ఇజ్రాయిల్ గాజాపై దాడి చేయడాన్ని పలు ముస్లిం, అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రసంగ సమయంలో అరబ్ దేశాలు, ముస్లిం దేశాల ప్రతినిధులు సభను నుంచి వాకౌట్ చేశారు. కొన్ని దేశాలు మాత్రమే సభలో కూర్చుని నెతన్యాహూ ప్రసంగాన్ని విన్నాయి. ఇదిలా ఉంటే, అరబ్ దేశాలకు విరుద్ధంగా యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) మాత్రం నెతన్యాహుతో సమావేశం అయింది.
అబుదాబి మాత్రం ఇజ్రాయిల్‌తో సంబంధాలను పెంచుకోవాలని, నిరసన తెలుపకూడదని నిర్ణయించుకుంది. నెతన్యాహూతో క్లోజ్డ్ డోర్ సమావేశం నిర్వహించింది యూఏఈ. అరబ్ ప్రతినిధులతో కలిసి వాకౌట్ చేసేందుకు నిరాకరించింది. ప్రస్తుతం, యూఏఈ చర్యలు ప్రాంతీయ ఐక్యత కన్నా, రాజకీయ, వ్యూహాత్మక పొత్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని సూచిస్తున్నాయి.
Read Also: Muhammad Yunus: “పాకిస్తాన్ వెళ్లిపో”.. బంగ్లాదేశ్ యూనస్‌కు చేదు అనుభవం..
యూఏఈ చెబుతున్న దాని ప్రకారం, గాజాలో యుద్ధాన్ని ముగించి పౌరుల ప్రాణాలనను రక్షించాల్సి తక్షణ అవసరం గురించి నొక్కి చెప్పడమే సమావేశ ముఖ్య ఉద్దేశ్యమని యూఏఈ తెలిపింది. రెందు దేశాల నాయకులు ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపు గురించి చర్చించిట్లు తెలుస్తోంది. నెతన్యాహు ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో, జోర్డాన్, ఖతార్, అల్జీరియా ప్రతినిధులు వాకౌట్ చేశారు. యూఏఈ ప్రతినిధులు మాత్రం సమావేశంలోనే ఉన్నారు.
యూఏఈ నిర్ణయం అరబ్ ప్రపంచంతో కొత్త చర్చకు దారి తీసింది. అబ్రహం ఒప్పందం కింద ఇజ్రాయిల్‌తో యూఏఈ సంబంధాలను కొనసాగిస్తుందని చాలా మంది భావిస్తున్నప్పటికీ, కొంత మంది మాత్రం అరబ్ సమైక్యతకు ఇది విరుద్ధంగా ఉందని విమర్శిస్తున్నారు. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, గాజాలో యుద్ధం ముగింపు, శాశ్వత స్థిరమైన పరిష్కారం, ప్రాణనష్టాన్ని నివారించడం వంటి వాటి గురించి నెతన్యాహూతో చర్చించినట్లు చెప్పారు.
HH Sheikh Abdullah bin Zayed met with Israeli Prime Minister Benjamin Netanyahu on the sidelines of the 80th session of the UN General Assembly in New York. His Highness stressed the urgent need to end the war in Gaza, reach a permanent and sustainable ceasefire, prevent further… pic.twitter.com/r4FEeWW7HA
— OFM (@OFMUAE) September 27, 2025