Nepal: నేపాల్‌లో ప్రజాస్వామ్యం అనే ప్రయోగం విఫలమైంది. 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు నేపాల్ ను పాలించాయంటే, అక్కడి అస్థిరత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2008లో ‘‘రాచరికం’’ పోయిన తర్వాత, ప్రజాస్వామ్య దేశంగా మారిన నేపాల్ అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. చివరకు అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయింది.
నేపాల్‌ను ఆర్మీ తన చేతుల్లోకి తీసుకుంది. అలాగే కర్ఫ్యూను కూడా కొనసాగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. శాంతిభద్రతలను కాపాడే ప్రయత్నాల్లో సహకరించాలని సైన్యం కోరింది.
యువత తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయంటారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వమే ఇందుకు నిదర్శనం. గతేడాది విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గి.. రాజీనామా చేసి కట్టుబట్టలతో భారత్‌కు పారిపోయి వచ్చేశారు. తాజాగా నేపాల్‌లో కూడా అదే పరిస్థితి తలెత్తింది.
నేపాల్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. దీంతో భద్రతా దళాలు-నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది నిరసనకారులు చనిపోయారు. ఇక కేపీ శర్మ ఓలి ప్రభుత్వం నిరసనలకు దిగొచ్చి... సోషల్ మీడియాపై విధించిన బ్యాన్‌ను ఎత్తేసింది.
నేపాల్-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. రసువా జిల్లాలో సరిహద్దుగా ఉన్న భోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో ఊహించని రీతిలో ప్రళయం సంభవించింది. మిటేరి వంతెన, డ్రై పోర్టు దగ్గర నిలిపి ఉన్న వందలాది వాహనాలు ఒక్కసారిగా కొట్టుకుపోయాయి.
King Cobra: హిమాలయాలు, ముఖ్యంగా ఎవరెస్ట్ పర్వతాలకు సమీపంలో విషపూరిత పాములు కనిపించడం శాస్త్రవేత్తల్ని కలవరపరుస్తోంది. నేపాల్ లోని ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ఒకటిన్నర నెలల వ్యవధిలో 10 విషపూరిత పాములు, ఇందులో 09 కింగ్ కోబ్రా పాములను పట్టుకున్నారు. ఇలా అత్యంత శీతల ప్రాంతంలో కింగ్ కోబ్రా పాములు కనిపించడంపై సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాములను నాలుగు వేర్వేరు ప్రాంతాలు గోపాలేశ్వర్, భంజ్యాంగ్, సోఖోల్, ఫుల్చౌక్ ప్రాంతాల నుండి- రక్షించినట్లు దక్షిణ్ కాళి మునిసిపాలిటీ…
ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని దక్షిణ సుమత్రాలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంపం 10 కిలోమీటర్ల (6.21 మైళ్ళు) లోతులో సంభవించిందని GFZ తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగ లేదు. అదే సమయంలో, నేపాల్‌లో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. నేపాల్‌లో భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. భూకంప కేంద్రం 29.36 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు…
బంగ్లాదేశ్ కొత్త వ్యూహాలు, చైనాతో పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భారతదేశం ఒక పెద్ద అడుగు వేసింది. బంగ్లాదేశ్‌కు ట్రాన్స్ షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దుచేసింది. వాస్తవానికి.. ఇటీవల చైనా పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ భారతదేశ ఈశాన్య ప్రాంతం గురించి వివాదాస్పద ప్రకటన చేశారు.
Earthquake: శుక్రవారం నేపాల్‌లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. నేపాల్‌లో వచ్చిన భూకంపం ప్రభావంతో హిమాలయాలను అనుకుని ఉన్న రాష్ట్రాల్లో, ఢిల్లీలో ప్రకంపనలు సంభవించాయి. భూకంపం రాత్రి 7.52 నిమిషాలకు సంభవించింది, దాని కేంద్రం 20 కి.మీ లోతులో ఉనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.