Nepal Flight crash: నేపాల్లో నిన్న జరిగిన భయంకర విమాన ప్రమాదంలో 18 మంది చనిపోయారు. ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. అయితే, అనూహ్యంగా ఈ ప్రమాదంలో ఒక్క పైలెట్ మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.
Nepal : నేపాల్లోని ఖాట్మండు విమానాశ్రయంలో డొమెస్టిక్ విమానం కూలిపోయింది. విమానం టేకాఫ్ సమయంలో మంటలు వ్యాపించాయి. ఇందులో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్-నేపాల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. వరుసగా మూడో మ్యాచ్లో గెలిచింది భారత్. 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.
UP Weather : భారీ వర్షాల కారణంగా నేపాల్ నుండి నీటిని విడుదల చేశారు. వరద ప్రభావం ఇప్పుడు యుపిలోని అనేక నగరాలపై పడింది. బహ్రైచ్, శ్రావస్తి, గోండా, బల్రాంపూర్, అయోధ్య, అంబేద్కర్ నగర్, బారాబంకి, సీతాపూర్‌లోని దాదాపు 250 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి.
Nepal: గత కొన్నేళ్లుగా నేపాల్ రాజకీయాలు అనిశ్చితికి మారుపేరుగా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’ శుక్రవారం విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. 275 మంది సభ్యులు ఉన్న హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ప్రచండకు కేవలం 63 ఓట్లు వచ్చాయి.
Nepal : నేపాల్లో ఈ ఉదయం కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
నేపాల్ను వరదలు ముంచెత్తాయి. నేపాల్లో ఒక నెలలోపే 47 మరణాలు నమోదయ్యాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి, నేపాల్ హోం మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రాణనష్టంతో పాటు గణనీయ ఆస్తి నష్టం వాటిల్లింది.
Nepal: నేపాల్ దేశాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల దేశవ్యాప్తంగా 14 మంది మరణించారు. మరో 9 మంది గల్లంతైనట్లు అక్కడి పోలీసులు ఆదివారం తెలిపారు.