Nepal: నేపాల్లో ప్రజాస్వామ్యం అనే ప్రయోగం విఫలమైంది. 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు నేపాల్ ను పాలించాయంటే, అక్కడి అస్థిరత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2008లో ‘‘రాచరికం’’ పోయిన తర్వాత, ప్రజాస్వామ్య దేశంగా మారిన నేపాల్ అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. చివరకు అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయింది.
నేపాల్లో జెన్-జెడ్ ఉద్యమకారులు సృష్టించిన మారణహోమం ఒక్కొక్కటిగా తాజాగా వెలుగులోకి వస్తున్నారు. నిరసన ముసుగులో కొంత మంది ఇష్టానురీతిగా ప్రవర్తించిన దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంత మంది ఇదే అదునుగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడగా.. మరికొందరు మంత్రులను లక్ష్యంగా చేసుకుని సామూహిక దాడులకు పాల్పడ్డారు.
నేపాల్లో ఒక రోజంతా అల్లకల్లోలం తర్వాత, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధాన్ని ప్రభుత్వం ఉపసంహరించింది. నిరసనకారులు తిరిగి రావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విధ్వంసం, దహనం సంఘటనలపై దర్యాప్తుకు ఆదేశించింది. హింసాత్మక నిరసనలపై, ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి మాట్లాడుతూ.. ఈ నిషేధం నిజమైన ఉద్దేశ్యాన్ని ప్రజలకు వివరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నిరసనకారుల చొరబాటు కారణంగా భయంకరమైన పరిస్థితి ఏర్పడిందని అర్ధరాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రధాన మంత్రి ఓలి తెలిపారు. ఖాట్మండుతో…