Nepal : నేపాల్లో పెరిగిన హిందూ రాష్ట్ర డిమాండ్.. అల్లకల్లోలం అక్కడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal : నేపాల్‌లో రాచరికం, హిందూ దేశం కోసం డిమాండ్ మళ్లీ తీవ్రమైంది. ఇందుకోసం రాజధాని ఖాట్మండులో గురువారం పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పడంతో జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలు, బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘటనలో పోలీసులకు, ఆందోళనకారులకు స్వల్ప గాయాలయ్యాయి. 2008లో రద్దు చేయబడిన రాచరికం తిరిగి రావాలని, హిందూ దేశంగా నేపాల్ స్థితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు గుమిగూడారు. వీరిలో ఎక్కువ మంది నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర మద్దతుదారులని చెబుతున్నారు. ప్రదర్శనలో జ్ఞానేంద్రకు అనుకూలంగా వారు నిరంతరం నినాదాలు చేశారు.
Read Also:Rashmika Mandanna: రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో వైరల్.. త్వరలో నిందితుల అరెస్టు
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
‘మాకు రాజరికం కావాలి, గణతంత్రం కాదు’
‘మాకు ప్రాణం కంటే రాజు ముఖ్యమని, మాకు రాచరికం కావాలి, గణతంత్రం కాదు’ అని నిరసనకారులు అన్నారు. నేపాల్ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు మొత్తం పరిపాలనా సిబ్బంది అవినీతికి పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపించారు. అందుకే ఈ విఫలమైన పాలనా వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also:Arvind Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా చేయాలా ? మీ అభిప్రాయం ఏంటి ?
2006లో అధికారాన్ని కోల్పోయిన జ్ఞానేంద్ర
కాలం ఎంత మారిపోయిందో, 2006లో అదే రాజు జ్ఞానేంద్ర వీర్ విక్రమ్ షా దేవ్ అధికారంలో ఉండగా, ఆయనకు వ్యతిరేకంగా అనేక వారాల పాటు వీధుల్లో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. అప్పటి రాజు జ్ఞానేంద్ర తన పాలనను వదులుకుని ప్రజాస్వామ్యాన్ని అమలు చేయవలసి వచ్చింది. రెండు సంవత్సరాల తరువాత, కొత్తగా ఎన్నికైన పార్లమెంటు రాచరికాన్ని రద్దు చేయడానికి ఓటు వేసింది. నేపాల్ గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. రిపబ్లిక్ అర్థం ఏమిటంటే, దేశానికి అధిపతి అధ్యక్షుడు, రాజు కాదు. తర్వాత నేపాల్‌ను హిందూ దేశంగా కాకుండా సెక్యులర్‌గా ప్రకటించారు. ఇది తాత్కాలిక రాజ్యాంగం సహాయంతో జరిగింది.
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!