వైసీపీలో నెమ్మదిగా లుకలుకలు బయటపడుతున్నాయి. సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని సోమవారం మాజీ మంత్రి బాలినేని ఆరోపించగా.. ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా సేమ్ డైలాగ్స్ చెప్పారు. తాను కూడా బాలినేని తరహాలో సొంత పార్టీ నేతల బాధితుడినేనని కోటంరెడ్డి స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలతో తాను కూడా ఇబ్బంది పడుతున్నానని.. కొందరు ఎమ్మెల్యేలు తన నియోజకవర్గంలో వేలుపెడుతున్నారని.. తన విషయంలో కూడా ఇలా జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తాను కూడా…
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మరో రాకెట్ ప్రయోగానికి వేదిక కానుంది. ఈనెల 30న అక్కడ పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో ఉపగ్రహ వాహక నౌక పీఎస్‌ఎల్వీ-సీ53 ద్వారా సింగపూర్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) కింద ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ప్రయోగ వేదిక వద్దకు రాకెట్‌ను చేర్చారు. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరిగింది. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను ఓటింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు. ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు అధికారులు తరలించారు. ఈనెల 26న ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం వెల్లడి కానుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు 61.70% పోలింగ్ జరిగింది. 6…
మెట్ట ప్రాంత ఆరోగ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించలేదు. ఈ ఏడాది భారీగా భక్తులు వస్తారని ఉద్దేశంతో ముందస్తుగా వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు .ముఖ్యంగా ఐదు రోజుల పాటు జరిగే వెంగమాంబ…
ఏపీలో సిలికా శాండ్ ఈ ఆక్షన్ (E-Auction) నిర్వహించింది ప్రభుత్వం. దీనికి అనూహ్య స్పందన లభించింది. నెల్లూరు జిల్లాలో సిలికాశాండ్ ఈ- ఆక్షన్ కు రికార్డు స్థాయిలో బిడ్ (Bid) దాఖలయింది. చిల్లకూర్ మండలంలోని తూర్పు కానుపూర్ గ్రామ పరిధిలోని ఆరు హెక్టార్లల్లోని సిలికా శాండ్ కి ఈ-ఆక్షన్ నిర్వహించారు. రూ.1.60 కోట్లతో ప్రారంభమైంది ఈ-ఆక్షన్. ఇందులో అత్యధికంగా రూ. 3.16 కోట్లు కోట్ చేసి బిడ్ దక్కించుకుంది స్మార్కో ఇండస్ట్రీస్. గ్లాస్ ఆధారిత పరిశ్రమలో కీలక…
ఏపీలో కొన్నిరోజుల్లో మరోసారి ఎన్నికల సమరం జరగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది. నేటితో ఆత్మకూరు ఉప ఎన్నిక నామినేషన్‌ల పర్వం కూడా ముగిసింది. చివరి రోజైన సోమవారం నాడు 13 నామినేషన్‌లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 28 నామినేషన్లు దాఖలైనట్లు స్పష్టం చేశారు. మంగళవారం నాడు నామినేషన్‌ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూరంగా ఉండటంతో ప్రధానంగా…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నామినేషన్ ఫార్మ్, అఫిడవిట్‌లో వ్యక్తిగత సమాచారాన్ని పొందుపర్చేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. అంతేకాకుండా నామినేషన్లు దాఖలు చేయడానికి అపాయింట్‌మెంట్, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు అనుమతులను పొందే అవకాశాన్ని భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు www.suvidha.eci.gov.in పోర్టల్ ద్వారా…
ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 6న నామినేషన్లకు చివరి గడువు, జూన్ 23న పోలింగ్ జరగనుంది. ఈనెల 26న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఉప ఎన్నిక కోసం విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హరేంధిర ప్రసాద్ వ్యవహరించనున్నారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారుల నియామకం జరిగింది. దివంగత మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి ఫిబ్రవరి 21వ తేదీన హఠాన్మరణానికి గురైన సంగతి…
మాజీ మంత్రి, దివంగత ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి మే 30న ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్…