జిల్లాలో టీడీపీ నేతలు తన్నులాటలు, తలకపోతలతో రచ్చ రచ్చ చేసుకుంటున్నా.. ఆ ఇన్ఛార్జ్ మంత్రి మాత్రం నాకేం కనపడదు, వినపడదు అన్నట్టుగా ఉంటున్నారా? పార్టీ పరువు నడి రోడ్డు మీదికి వస్తున్నా.. ఆయన మాత్రం ఆ గోల నాకేల అంటున్నారా? నవ్వే వాళ్ళను నవ్వనీ, ఏడ్చేవాళ్ళను ఏడ్వనీ అన్నట్టు నిర్లిప్తంగా ఉంటున్న ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరు? ఆయన ఎందుకలా ఉంటున్నారు? Also Read:Maharashtra: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనాలను ఢీకొన్న ట్రక్కు.. 8 మంది…
ఇసుక మాఫియా దందాకు ఏడుగురు బలయ్యారు. మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చిన్నారులు అనాథలుగా మారారు. ఇంత జరిగినా ప్రమాదానికి కారకులైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదు. పైగా సిల్లీ రీజన్స్‌తో కేసు పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకూ నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోంది.
నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దగ్గు జలుబుతో ఆసుపత్రికి చేరిన వారికి కరోనా టెస్టులు చేయడంతో ఒకేసారి 6 కేసులు బయటపడ్డాయి. కరుణ లక్షణాలు తక్కువగా ఉండడంతో ఐదుగురిని హోమ్ ఐసోలేషన్ పంపిన వైద్యులు.. మరో ఒకరికి నెల్లూరులోని కరోనా వార్డులో చికిత్స అందిస్తున్నారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగించారు. మూడు రోజులు పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.. 6వ తేదీ ఉదయం నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు కస్టడీకి తీసుకోవాలని స్పష్టం చేశారు. కాకాణి తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని జడ్జి సూచించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు.. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. తాతా హోటల్ పక్కన జంపాలవారిపాలెంలో టీడీపీ నేత తోపూరి నరసింహం అనే వ్యక్తిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు బ్రహ్మయ్య అనే వ్యక్తి.. అంతటితో ఆగకుండా.. రెండు రోజులు నరసింహం మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో వేశాడు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్నారు. నెల్లూరు పాలెంలోని గిరిజన కాలనీలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. కొద్దిసేపు వారితో ముచ్చటించనున్నారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద అదుపుతప్పి రోడ్డుపన్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది కారు.. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.. ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు.. మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వద్ద కారు భీభత్సం సృష్టించింది..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుంటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.. ఇక, మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ప్రకటించారు పవన్..