Sriharikota: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు సీఐఎస్‌ఏఫ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంతో.. అసలు షార్ సెంటర్‌లో ఏం జరుగుతోంది? అనే ఆందోళన మొదలైంది.. అయితే, ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. ఆత్మహత్యలపై విచారణ చేపట్టారు.. చెట్టుకు ఊరివేసుకుని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్య చేసుకున్నారు.. 29 ఏళ్ల చింతామణి 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.. శిక్షణానంతరం శ్రీహరికోటలోని యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు..…
Nellore District: నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ వివాదం కలకలం రేపుతోంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తమను నమ్మించి మోసం చేశారని శివచరణ్‌రెడ్డి తల్లి లక్ష్మీదేవి ఆరోపించారు. ఇటీవల తనకు కొడుకు ఎవరూ లేరని చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ‘నేను ఎవరిని?’ అంటూ శివచరణ్ రెడ్డి ఒక లేఖను విడుదల చేయడంతో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో చిన్నతనంలో తీసుకున్న ఫోటోలను విడుదల చేశారు. శివ చరణ్ రెడ్డితో తనకు ఎలాంటి…
Andhra Pradesh: కొత్త ఏడాదిలో ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. దీంతో పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. తొలుత నెల్లూరు జిల్లా రాజకీయాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఈ మేరకు సోమవారం నాడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పిలిపించి క్లాస్ తీసుకున్నారు. ఆయన ఇటీవల పార్టీ కార్యక్రమాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం సీఎం జగన్ వద్దకు వెళ్లింది. దీంతో కోటంరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు చేశారు. అయితే తాను పార్టీపై…
Flexi war between YCP leaders: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఉదయగిరి, దుత్తలూరు, నందవరం.. తదితర ప్రాంతాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి వర్గం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫొటోను కూడా పొందుపర్చి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫ్లె్క్సీలను ఏర్పాటు చేశారు.. అయితే, ఈరోజు వాటిని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు…
Nellore District: ఈ లోకంలో కన్నబిడ్డలపై ప్రేమ లేని తల్లిదండ్రులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. కానీ కొందరు తమ ప్రేమను బయటకు చాటుకుంటారు.. కొందరు అయితే తమ ప్రేమను మనసులోనే దాచిపెట్టుకుంటారు. అయితే ఓ తండ్రి మాత్రం తన ప్రేమను ఎవరికీ సాధ్యం కాని రీతిలో చాటుకున్నాడు. నెల్లూరు జిల్లాలోని కాకుటూరు గ్రామంలో ఓ తండ్రి తన కుమార్తె జ్ఞాపకంగా ఆలయం కట్టించాడు. నిత్యం అందులో పూజలు చేస్తూ కనిపిస్తున్నాడు. కాకుటూరు గ్రామానికి చెందిన చెంచయ్య,…
CM Jagan: ఏపీ సీఎం జగన్ ఈనెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీ జెన్‌కో థర్మల్ పవర్ స్టేషన్‌లోని మూడో యూనిట్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్‌లోని మూడో యూనిట్ పూర్తి సామర్థ్యం 800 మెగావాట్లు అని అధికారులు వెల్లడించారు. అయితే సీఎం జగన్ పర్యటనను…
CM Jagan: ఈనెల 6న మంగళవారం నాడు ఏపీ సీఎం జగన్ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు. ఆ తర్వాత నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ మేరకు సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయ అధికారులు…
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. దీంతో ఆయనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గుండె సమస్యతో ఆపదలో ఉన్న ఓ చిన్నారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి అండగా నిలిచారు. ఉప్పుటూరు గ్రామంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇటీవల గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా.. గిరిజన కుటుంబానికి చెందిన చిన్నారి స్నేహకు గుండె సమస్య ఉన్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే స్పందించి కారు ఏర్పాటు చేసి తన ప్రతినిధిని పంపించి…