Nellore Crime: నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆకాష్ అనే యువకుడు తిరుపతిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆకాశ్ మృతికి పోలీసుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ.. మిత్రులు.. కుటుంబ సభ్యులు సైదాపురం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని బైఠాయించారు. ఒక కేసు విచారణ నిమిత్తం ఆకాష్ మీ పలుమార్లు స్టేషన్.కు పిలిచి ఎస్.ఐ. నాగబాబుతో పాటు కొందరు కానిస్టేబుళ్లు వేధింపులకు గురి చేశారని బంధువులు ఆరోపించారు. పోలీసులపై…
YSR Congress Party: నెల్లూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీలో నేతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రిగా నిర్వహించే సమావేశాలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడంలేదు. ఇక.. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. అనిల్ కుమార్‌కు బాబాయ్ వరుసయ్యే రూప్ కుమార్ యాదవ్ ఆయనతో విభేదించి ప్రత్యేక…
నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేసినట్లు వైసీపీ ఆరోపించింది.
Political Heat in Nellore: నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో…పాలిటిక్స్‌ను తారాస్థాయికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్రాప్‌లో పడి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారంటూ… కోటంరెడ్డిపై మంత్రి కాకాణి ఆరోపించారు. కాకాణి వ్యాఖ్యలకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వద్దామనుకుంటే నమ్మక ద్రోహమా? అని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబానికి మీరు వీరవిధేయుడైతే వైఎస్ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నిస్తే… ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు.…
Off The Record: వైసీపీలో అసమ్మతి గళాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో లుకలుకలు ఓ రేంజ్‌లో రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి… ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా ఆనంను తప్పించి… నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియమించింది. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజవర్గం వంతు వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి…
KotamReddy Sridhar Reddy: నెల్లూరు జిల్లాలోని రాజకీయాలపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు రాజకీయ వారసత్వం లేకున్నా పోరాటాలతో ఎదిగానని స్పష్టం చేశారు. తనను రాజకీయంగా ఎదగనీయకుండా జిల్లాలోని పెద్ద రాజకీయ కుటుంబాలు అడ్డుకున్నాయని పరోక్షంగా ఆనం, మేకపాటి కుటుంబాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయంగా అవకాశాలు వచ్చినా ఈ పెద్ద కుటుంబాలు అనేకసార్లు తన గొంతును కోశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులన్నీ వీళ్లే అనుభవిస్తున్నారని.. ఇకనుంచి ఈ ధోరణి కొనసాగనివ్వబోమన్నారు.…