ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో వైసీపీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని కాసేపట్లో హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. సోమవారం రాత్రి వరకు అక్కడే ఉంచి అనంతరం స్వగ్రామమైన నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణపల్లికి తరలించనున్నారు. బుధవారం నాడు మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు అమెరికాలో చదువుతుండటంతో అతడు వచ్చాకే అంత్యక్రియలు జరపాలని కుటుంబీకులు నిర్ణయించినట్లు సమాచారం. కాగా మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం రాజకీయ నేతలతో…
బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో క్రికెటర్లపై ఫ్రాంఛైజీలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. వేలంలో శనివారం నాడు ఏకంగా 10 మంది ఆటగాళ్లు రూ.10 కోట్లుపైన ధర పలికారు. ఆదివారం కూడా ఆటగాళ్ల వేలం జోరుగా సాగుతోంది. ఈ మేరకు తెలుగు ప్లేయర్ ఐపీఎల్ మెగా వేలంలో ఎంపికయ్యాడు. నెల్లూరు జిల్లాకు చెందిన అశ్విన్ హెబ్బార్‌ను నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అశ్విన్ హెబ్బార్ 2015 నుంచి రంజీల్లో…
నెల్లూరుకు చెందిన అకరపాక సురేష్ అనే దివ్యాంగుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనను చెడు వ్యసనాల నుంచి కాపాడింది, సమాజంలో వెక్కిరింపుల నుంచి గౌరవప్రదంగా నిలబెట్టింది అయ్యప్పస్వామి అని దివ్యాంగుడు బలంగా నమ్మాడు. దీంతో ఏకంగా 750 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శబరిమలలోని అయ్యప్పను దర్శించుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 20న నెల్లూరు పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న అమ్మ వారి ఆలయంలో ఇరుముడి కట్టుకుని పాదయాత్రగా బయలుదేరిన సురేష్.. కరోనా కాలంలోనూ ఎన్నో వ్యయ…
నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల గుండెపోటుకు గురికావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. Read Also: డప్పుతో దరువేసిన ఎమ్మెల్యే… ఎవరో తెలుసా? తాను ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని వీడియోలో ఎమ్మెల్యే మేకపాటి తెలిపారు. తాను ప్రస్తుతం…
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. కరోనా మందు పంపిణీ చేసే ఆనందయ్యకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే… ఒమిక్రాన్ మందు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆనందయ్య ప్రకటించిన నేపథ్యంలో స్థానికులు ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగారు. కరోనా మందు కోసం ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు తరలిరావడం వల్ల తమకు కరోనా సోకుతుందని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో కరోనా మందు పంపిణీని అడ్డుకున్నారు. Read Also: గోవాలో రెచ్చిపోయిన సమంత..…
కరోనాకు మందు తయారుచేసి సంచలనం సృష్టించిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య తాజాగా ఒమిక్రాన్ వేరియంట్‌కు కూడా మందు తయారు చేశారు. సుమారు 22 రకాల దినుసులతో ఈ మందును తయారుచేసినట్లు ఆనందయ్య వెల్లడించారు. ఒమిక్రాన్ సోకకుండా అందరూ ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ మాదిరి ఈ మందును వేసుకోవాలని ఆనందయ్య సూచించారు. ఈ మందును ఒకేరోజు రెండు పూటలా తీసుకుంటే సరిపోతుందన్నారు. ఈ మేరకు ఒమిక్రాన్ మందును పంపిణీ చేస్తున్నట్లు ఆనందయ్య పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకిన వారు…
ఏపీలోని గ్రామీణ ప్రాంతాలలో టిక్కెట్ రేట్లు చాలా తక్కువగా ఉండటంతో తమకు నష్టాలు వస్తాయని భావిస్తూ యజమానులు పలు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. ఈ జాబితాలో సౌతి ఇండియాలోనే అతిపెద్ద స్క్రీన్ కూడా చేరింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ‘వి ఎపిక్’ థియేటర్‌ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ థియేటర్‌లో 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు గల అతి పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఇది సౌతిండియాలోనే అతి పెద్ద భారీ స్క్రీన్. అటు ప్రపంచంలో…
కరోనా సమయంలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన ఆనందయ్య పసరు మందుకు జనాలు సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అప్పట్లో దీనిపై అయిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వకున్నా జనాలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఒకానొక సమయంలో జనాలను కంట్రోల్ చేసేందుకు అటు ఏపీ ప్రభుత్వానికి సైతం ఇబ్బందులు తప్పలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆనందయ్య మందును శాస్త్రీయ పద్ధతుల్లో తయారు చేయడం లేదంటూ మందు పంపిణీ నిలిపి వేయాలని…
నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంతో నెల్లూరు నేతల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు నగర పార్టీ డివిజన్ కమిటీలను రద్దు చేశారు. అంతేకాకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు నేతలు అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని టీడీపీ అధినేత సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరు నేతలు తమ పనితీరు మార్చుకోకుంటే భవిష్యత్‌లో కఠిన నిర్ణయాలు ఉంటాయని…
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి సంగం వద్ద వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రోడ్డు పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న 15 మంది వాగు ఉధృతికి కొట్టుకుపోయారని స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే వాగులో భారీ వరదలో పలువురు ప్రయాణికులు కొట్టుకుపోతుండగా.. ఏడుగురిని స్థానికులు…